AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chat GPT: వామ్మో ఏందిరా సామీ.. నీళ్లను తాగేస్తున్న చాట్ జీపీటీ..శాస్రవేత్తలు షాక్

ప్రస్తుతం చాలా మంది చాట్‌జీపీటీని వినియోగిస్తున్నారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే వంద కొట్ల మంది వినియోగదారులతో ప్రపంచాన్ని చుట్టిసిన చాట్ జీపీటీ.. దిగ్గజ సంస్థలకు పోటీగా నిలబడింది. అయితే ఈ చాట్ జీపీటీ గురించి కొంతమంది శాస్త్రవేత్తలు కీలక విషయాలు బయటపెట్టారు.

Chat GPT: వామ్మో ఏందిరా సామీ.. నీళ్లను తాగేస్తున్న చాట్ జీపీటీ..శాస్రవేత్తలు షాక్
Chatgpt Robot
Aravind B
|

Updated on: Apr 15, 2023 | 12:47 PM

Share

ప్రస్తుతం చాలా మంది చాట్‌జీపీటీని వినియోగిస్తున్నారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే వంద కొట్ల మంది వినియోగదారులతో ప్రపంచాన్ని చుట్టిసిన చాట్ జీపీటీ.. దిగ్గజ సంస్థలకు పోటీగా నిలబడింది. అయితే ఈ చాట్ జీపీటీ గురించి కొంతమంది శాస్త్రవేత్తలు కీలక విషయాలు బయటపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజు ఇలా చాట్ జీపీటీని వినియోగిస్తున్నందున భారీ ముల్యం చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్‌సైడ్, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్‌టన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో.. 20-50 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు చాట్‌జీపీటీకి దాదాపు 500 మిల్లీ లీటర్ల నీరు అవసరం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

అయితే చాట్‌జీపీటీకి, నీటి మధ్య సంబంధం ఏమిటంటే..ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మోడల్‌లను అమలు చేస్తున్నప్పుడు ఆ సర్వర్‌లను చల్లబరచేందుకు పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తారని తెలిపారు. వాటి డాటా సెంటర్ల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు ఉత్పత్తికి నీటి వినియోగాన్ని లెక్కగట్టి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సర్వర్లు నడవాలంటే కూడా మంచి నీటినే వినియోగించాల్సి ఉంటుందట. అయితే జీపీటీ-3కి శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ 7 లక్షల లీటర్ల నీటిని వినియోగించిదని పేర్కొన్నారు. ఇదే కాకుండా ఇతర సంస్థల ఏఐ మాడళ్లు నిర్వహణకు భారీగా నీటిని వినియోగిస్తాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..