PM Modi: ‘ప్లీజ్‌ మోడీ జీ.. మాకో మంచి స్కూల్‌ కట్టించండి’.. నెట్టింట్లో వైరల్‌గా మారిన చిన్నారి వీడియో

ఉగ్రవాద దాడులతో దద్దరిల్లే జమ్మూ కశ్మీర్‌ సంగతి చెప్పనక్కర్లేదు. ఇక్కడి పాఠశాలల్లో అసలు విద్యార్థులు ఉండడం లేదు. ఒకవేళ స్కూల్‌కు వచ్చినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఈ క్రమంలో 'మా స్కూల్ ను బాగు చేయండి' అంటూ ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలపై సౌకర్యాలపై ఏకరువు పెడుతూ జమ్మూకు చెందిన ఓ చిన్నారి ప్రధాని..

PM Modi: 'ప్లీజ్‌ మోడీ జీ.. మాకో మంచి స్కూల్‌ కట్టించండి'.. నెట్టింట్లో వైరల్‌గా మారిన చిన్నారి వీడియో
Pm Narendra Modi
Follow us
Basha Shek

|

Updated on: Apr 15, 2023 | 8:27 AM

దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ కొన్ని గ్రామాలు ఇంక వెనకబడే ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చదువుకునేందుకు పాఠశాలలు లేకపోవడంతో పిల్లల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో పేరుకు పాఠశాలలు ఉన్నా ఉపాధ్యాయులు రావడం లేదు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు ఉండడం లేదు. ఇక నిత్యం ఉగ్రవాద దాడులతో దద్దరిల్లే జమ్మూ కశ్మీర్‌ సంగతి చెప్పనక్కర్లేదు. ఇక్కడి పాఠశాలల్లో అసలు విద్యార్థులు ఉండడం లేదు. ఒకవేళ స్కూల్‌కు వచ్చినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఈ క్రమంలో ‘మా స్కూల్ ను బాగు చేయండి’ అంటూ ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలపై సౌకర్యాలపై ఏకరువు పెడుతూ జమ్మూకు చెందిన ఓ చిన్నారి ప్రధాని నరేంద్ర మోడీకి వీడియో సందేశాన్ని పంపింది. తన స్కూల్ దుస్థితిని ఆ వీడియోలో వివరిస్తూ.. మా కోసం మంచి స్కూల్‌ బిల్డింగ్‌ కట్టించాలని ప్రధానిని బాలిక కోరింది. దేశం మొత్తం చెప్పింది వినాలని, నా మొర కూడా ఆలకించాలని ఆ పసిపాప విజ్ఞ‌ప్తి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా లొహయ్-మల్హర్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ వీడియోను ఒకరు తన ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. 2 మిలియన్లకుపైగా వ్యూస్, దాదాపు 1.20 లక్షల లైక్‌లు వచ్చాయి. అలాగే వేలాది కామెంట్లు వచ్చాయి.

యూనిఫామ్స్‌ మురికిగా మారుతున్నాయి..

సుమారు ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆ బాలిక మొదట తన గురించి పరిచయం చేసుకుంది. ఆ తర్వాత తన పాఠశాల ఆవరణలో నడుస్తూ.. ‘మోడీ జీ.. మా స్కూల్‌లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోండి’ అని వేడుకుంది. అలాగే తలుపులు మూసివున్న ఓ గది వైపు ఫోన్‌ కెమెరాను తిప్పుతూ.. ‘ప్రిన్సిపాల్ ఆఫీస్, స్టాఫ్ రూమ్’ అని తెలిపింది. ఫ్లోర్లింగ్ ఎంత దారుణంగా ఉందో చూడండి.. దీనిపైనే రోజూ మమ్మల్ని కూర్చోబెడతారు అని క్లాస్‌ రూంలను చూపించింది. ‘సార్‌.. మా స్కూల్ ఉన్న పెద్ద బిల్డింగ్‌ని మీకు చూపిస్తాను.. గత ఐదేళ్లుగా భవనం ఎంత అపరిశుభ్రంగా ఉందో మీరే చూడండి.. నేను మిమ్మల్ని భవనం లోపలకు తీసుకెళ్తాను.. మా కోసం మంచి స్కూల్ కట్టాలని ప్రాధేపడుతున్నాను.. మురికిగా ఉన్న ఫ్లోర్‌పై కూర్చోవడంతో మా యూనిఫామ్స్ అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. దీంతో అమ్మలు తరచూ మమ్మల్ని తిడుతున్నారు. ఏం చేస్తాం.. ఇక్కడ మాకు కూర్చోవడానికి బెంచీలు కూడా లేవు’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

మాకు చదువుకోవాలని ఉంది..

అక్కడ నుంచి మెట్ల ద్వారా మొదటి ఫ్లోర్‌లోకి వెళ్లిన ఆ చిన్నారి.. అక్కడ పరిస్థితిని మోడీకి చూపించింది. ఆ తర్వాత కిందకు దిగి.. కాంపౌండ్ వాల్ వద్దకు వెళ్లి విరిగిపోయి ఉన్న టాయ్‌లెట్‌‌ను చూపించింది. ఇక చివరగా.. ‘మోడీజీ దయచేసి నా మాట వినండి.. మాకు మంచి స్కూల్‌ బిల్డింగ్‌ను నిర్మించండి.. నేలపై కూర్చోవాల్సిన అవసరం లేని విధంగా పాఠశాలను నిర్మించండి. మేమంతా బాగా చదువుకుంటాం’ అని రిక్వెస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

చిన్నారి వీడియో..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?