ఇంతవరకు ఎవ్వరు చేయలేని సాహసం.. 500 రోజులు ఒంటరిగా అక్కడే
స్పెయిన్‌కు చెందిన బియాట్రిజ్ ఫ్లమిని అనే పర్వతారోహకురాలు ప్రపంచ రికార్డు సృష్టించింది. ఓ భూగర్భ గుహలో ఆమె దాదాపు 500 రోజులు ఒంటరిగా జీవించి ఔరా అనిపించింది. తాజాగా ఆమె ఆ గుహను వీడి శుక్రవారం రోజున బాహ్య ప్రపంచంలోకి అడుగులేసింది.
స్పెయిన్‌కు చెందిన బియాట్రిజ్ ఫ్లమిని అనే పర్వతారోహకురాలు ప్రపంచ రికార్డు సృష్టించింది. ఓ భూగర్భ గుహలో ఆమె దాదాపు 500 రోజులు ఒంటరిగా జీవించి ఔరా అనిపించింది. తాజాగా ఆమె ఆ గుహను వీడి శుక్రవారం రోజున బాహ్య ప్రపంచంలోకి అడుగులేసింది. భూగర్భంలో దీర్ఘకాలంపాటు ఒంటరిగా ఉంటే వ్యక్తులపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలుసుకునేందుకు చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా 2021 నవంబరు 21న ఫ్లమిని ఒంటరిగా 70 మీటర్ల లోతులో ఉన్న ఓ గుహలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఆమెకు అవసరమైన ఆహారం, ఇతర సామగ్రిని తన బృంద సభ్యులు ఓ చోట పెట్టి వెళ్లిపోయేవారు.
అయితే ఫ్లమిని వాటిని తీసుకొనేది. ఆమెకు అవసరం లేకుండా మారిన వస్తువులను అక్కడే వదిలేసేది. గుహలో పఠనం, చిత్రలేఖనం, నేత వంటి ఇష్టమైన పనులు చేస్తూ ఆమె కాలం వెల్లదీసింది. ఆ గుహలో ఏర్పాటు చేసిన రెండు కెమెరాల సాయంతో తన అనుభూతులను ఎప్పటికప్పుడు రికార్డు చేసి బయటకు పంపించింది. అయితే ఆమె గుహలో ఉండాల్సిన నిర్ణీత కాలం పూర్తవడంతో శుక్రవారం చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చింది. సమయం ఎంతవుతోందో కూడా తెలుసుకునే సౌకర్యం లేకపోవడంతో.. గుహలోకి వెళ్లిన కొన్నాళ్లకు తాను రోజులను లెక్కించడం కూడా మానేశానని ఫ్లమిని పేర్కొంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..