AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America Strong Warning: చైనాకు మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన అమెరికా.. ఎందుకంటే..

America Strong Warning: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య వార్‌ (Russia-Ukraine War) కొనసాగుతోంది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోయింది. ఇక రష్యా యుద్ధానికి..

America Strong Warning: చైనాకు మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన అమెరికా.. ఎందుకంటే..
Subhash Goud
|

Updated on: Apr 22, 2022 | 4:08 PM

Share

America Strong Warning: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య వార్‌ (Russia-Ukraine War) కొనసాగుతోంది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోయింది. ఇక రష్యా యుద్ధానికి చైనా మద్దతుపై ఆమెరిక కీలక వ్యాఖ్యలు చేసింది. చైనాకు మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది అమెరికా. రష్యాకు ఆర్థిక, లేదా ఆయుధాల విషయాల్లో సహాయం చేస్తే చైనాపై ఆంక్షలు తప్పవని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ వెండి షర్మాన్ (U.S. Deputy Secretary of State Wendy Sherman) హెచ్చరించారు. ఒక వేళ రష్యాకు చైనా సాయం చేస్తే.. చైనా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ, రష్యాకు మిలటరీ సామాగ్రి తరలిస్తే అసలు ఊరుకునేదే లేదని షర్మాన్‌ వార్నింగ్‌ ఇచ్చారు.ఆర్థిక ఆంక్షలతో పాటు మరిన్ని ఆంక్షలు చైనా ఎదుర్కొక తప్పదని అన్నారు. రష్యా తప్పుడు ప్రచారాల ద్వారా ఉక్రయిన్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనా సహకరించడం లేదని షెర్మాన్‌ గురువారం బస్సెల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. రష్యా యుద్ధం నుంచి బీజింగ్‌ సరైన పాఠాలు నేర్చుకుంటుందని అన్నారు.

ఆంక్షలు, ఎగుమతులపై నియంత్రణలు, హోదాల పరంగా రష్యాకు వ్యతిరేకంగా తాము ఏమి చేశామో వారు చూశారని, దీంతో రష్యాకు చైనా మద్ధతు ఇస్తే మేము ఎలాంటి చర్యలకు దిగుతామో ఇప్పటికే వారు ఓ అంచనాకు వచ్చి ఉంటారని పేర్కన్నారు. రష్యా ఆయుధాల ఎగుమతులపై ప్రపంచ దేశాల ఆంక్షల నేపథ్యంలో వాటిపై ఆధారపడకుండా ఉండేందుకు భారత్ కు సహాయం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంలో భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు. అమెరికాను దాని మిత్ర దేశాల నుంచి వేరుచేయలేమని చైనా ఇప్పటికే తెలుసుకుని ఉంటుందని, దీంతో పాటు రష్యా యుద్ధం నుంచి చైనా సరైన పాఠాలు నేర్చుకుంటుందని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Johnson-Modi Meet: అపురూపమైన ఆహ్వానాన్ని ఎప్పుడూ చూడలేదు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

Corona Crisis: పుట్టినిల్లు చైనాని వణికిస్తోన్న కరోనా.. షాంఘైలో ఆహారపు కొరత.. మరోవైపు పెరుగుతున్న మానసిక ఆరోగ్య బాధితులు