Johnson-Modi Meet: అపురూపమైన ఆహ్వానాన్ని ఎప్పుడూ చూడలేదు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

తొలిసారిగా భారత్ కు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(Britain PM Boris Johnson).. భారత ప్రభుత్వం నుంచి లభించిన ఆహ్వానంపై ఆనందం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్న ఆయన అపూర్వ స్వాగతంపై ప్రధాని నరేంద్ర మోడీకి....

Johnson-Modi Meet: అపురూపమైన ఆహ్వానాన్ని ఎప్పుడూ చూడలేదు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Pm Narendra Modi Uk Pm Boris Johnson
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 22, 2022 | 1:10 PM

తొలిసారిగా భారత్ కు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(Britain PM Boris Johnson).. భారత ప్రభుత్వం నుంచి లభించిన ఆహ్వానంపై ఆనందం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్న ఆయన అపూర్వ స్వాగతంపై ప్రధాని నరేంద్ర మోడీకి(PM Modi) ధన్యవాదాలు తెలిపారు. బ్రిటన్, ఇండియా రెండు దేశాల మధ్య ఇప్పుడున్నంత మంచి సంబంధాలు ఎన్నడూ లేవని ఇంగ్లండ్ ప్రధాని వ్యాఖ్యానించారు. ఇంతటి సంతోషకరమైన ఆహ్వానాన్ని తాను ఎప్పుడూ చూడలేదని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి అపురూపమైన స్వాగతాన్ని పొందలేనేమోనని జాన్సన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెండు రోజుల భారత్‌ పర్యటనలో భాగంగా గురువారం గుజరాత్‌కు వెళ్లిన జాన్సన్.. అక్కడి నుంచి ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి భవన్ వద్ద ఆయనకు భారత ప్రధాని మోడీ ఆహ్వానం పలికారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత పరంగా సహకారా న్ని అందించుకోవడం, ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలపై రెండు దేశాల ప్రధానులు చర్చించుకోనున్నారు. అలాగే విదేశాంగ మంత్రి జై శంకర్‌, జాన్సన్ మధ్య చర్చలు జరగనున్నాయి.

ఈ రోజు ఇండియా ప్రధాని మోడీని కలవడానికి ముందు ‘నా స్నేహితుడితో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నాను’ అని యూకే ప్రధాని ట్వీట్ చేశారు. నిరంకుశ రాజ్యాల నుంచి పెరుగుతోన్న బెదిరింపు వేళ.. వాతావరణ మార్పులు, ఇంధన భద్రత, రక్షణ వంటి అంశాల్లో మన ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యం ప్రధానమైనదని ట్వీట్ లో పేర్కొ్న్నారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం తొలిసారిగా భారత్ కు వచ్చిన ప్రధాని జాన్సన్ గురువారం గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. గుజరాతీ సాంప్రదాయ నృత్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. గాంధీనగర్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ప్రపంచశాంతికి గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు. చరఖా తిప్పారు. గాంధీనగర్‌లోని స్వామినారాయణ శాఖకు చెందిన ప్రసిద్ధ అక్షరధామ్ దేవాలయాన్ని సందర్శించారు. దేశవ్యాప్తంగా బుల్‌డోజర్‌ పాలిటిక్స్‌ ఊపందుకున్న వేళ సాక్షాత్తూ బ్రిటన్‌ ప్రధాని బుల్‌డోజర్‌ను నడపడం అందరి దృష్టిని ఆకర్షించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Also Read

Corona Crisis: పుట్టినిల్లు చైనాని వణికిస్తోన్న కరోనా.. షాంఘైలో ఆహారపు కొరత.. మరోవైపు పెరుగుతున్న మానసిక ఆరోగ్య బాధితులు

Stock Market: వారాంతంలో మార్కెట్ల బేజారు.. మళ్లీ నష్టాల్లోకి కీలక సూచీలు.. ఎందుకంటే..

Tirumala: శ్రీవారి ఆలయంలో ఒక మూలకు వచ్చేసరికి.. చాలా మంది భక్తులు.. ఆగి.. తలెత్తి.. చూస్తుంటారు ఎందుకంటే