AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bizarre: బిడ్డకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక.. పోలీసుల అదుపులో 12 ఏళ్ల బాలుడు

తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగుచూసింది.  17 ఏళ్ల పెళ్లికాని బాలిక బిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాశంమైంది. అందుకు కారణం 12 బాలుడని బాధితురాలు తెలిపింది.

Bizarre: బిడ్డకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక.. పోలీసుల అదుపులో 12 ఏళ్ల బాలుడు
Tamil Nadu News
Ram Naramaneni
|

Updated on: Apr 22, 2022 | 12:20 PM

Share

Tamil Nadu: తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగుచూసింది.  17 ఏళ్ల పెళ్లికాని బాలిక బిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాశంమైంది. ఈ కేసులో అత్యాచార ఆరోపణలపై 12 ఏళ్ల బాలుడ్ని తంజావూరు(Thanjavur) మహిళా పోలీస్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం, 2012 కింద బాలుడ్ని అరెస్ట్ చేశారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా బాలుడిని అరెస్టు చేసినప్పటికీ, ఆమె గర్భధారణకు మరెవరైనా కారకులా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పాఠశాల మానేసిన వీరిద్దరూ, ఒకే పరిసరాల్లో నివసిస్తున్నారు. బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఏప్రిల్ 16న రాజా మిరాసుదార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. టెస్టులు చేసిన డాక్టర్లు.. ఆమె తొమ్మిది నెలల గర్భవతి అని గుర్తించారు. అదే రోజు బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. బాలిక 12 ఏళ్ల బాలుడు ఇందుకు కారకుడని చెప్పడంతో.. తొలుత పోలీసులు షాక్ తిన్నారు. అనంతరం బాలుడిని అదుపులోకి తీసుకుని.. ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అతడిని తంజావూరులోని జువైనల్ హోంకు తరలించారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవిమతి..మాట్లాడుతూ… బాలిక, ఆమె తల్లిదండ్రులు బిడ్డను ప్రసవించే వరకు గర్భం గురించి తెలియనట్లు నటించారని చెప్పారు. శాస్త్రీయ పద్ధతులు, DNA పరీక్ష ద్వారా బాలుడి వయస్సును నిర్ధారించినట్లు ఆమె వెల్లడించారు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గోప్యతను కాపాడేందుకు.. వివరాలను బహిర్గతం చేయబడలేదు)

Also Read: Viral: ఇంట్లో ఎవరూ లేరు వచ్చేమంది.. కింగ్‌లా అక్కడికి వెళ్లిన కుర్రాడికి దిమ్మతిరిగే షాక్..