Tamil Nadu: మదురైలో తీవ్ర విషాదం.. ట్యాంక్ లో విష వాయువులు వెలువడి ముగ్గురు కార్మికుల దుర్మరణం

తమిళనాడులోని(Tamil Nadu) మదురైలో ఘోరం జరిగింది. బతుకుదెరువు కోసం పనికి వెళ్లిన వారు విగతజీవులుగా మారారు. ట్యాంకును(Tank) శుభ్రపరుస్తుండగా విషవాయువులు వెలువడంతో ఒకరు మృతి చెందారు. అతడిని కాపాడే క్రమంలో మరో ఇద్దరు...

Tamil Nadu: మదురైలో తీవ్ర విషాదం.. ట్యాంక్ లో విష వాయువులు వెలువడి ముగ్గురు కార్మికుల దుర్మరణం
Death
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 22, 2022 | 10:44 AM

తమిళనాడులోని(Tamil Nadu) మదురైలో ఘోరం జరిగింది. బతుకుదెరువు కోసం పనికి వెళ్లిన వారు విగతజీవులుగా మారారు. ట్యాంకును(Tank) శుభ్రపరుస్తుండగా విషవాయువులు వెలువడంతో ఒకరు మృతి చెందారు. అతడిని కాపాడే క్రమంలో మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. మదురై కార్పొరేషన్‌లోని 70వ వార్డులో.. కార్పొరేషన్‌ మురుగునీటి ట్యాంక్‌లో విద్యుత్‌ మోటారు రిపేర్ అయింది. దీంతో మురుగునీరు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న నలుగురు ఎలక్ట్రికల్ ఇంజినీర్లు మోటారును బయటకు తీసి మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో ట్యాంక్ ను శుభ్రం చేస్తున్న శరవణన్ విషవాయువు ప్రభావంతో లోపల పడిపోయాడు. అతడిని రక్షించేందుకు శివకుమార్, లక్ష్మణన్ అనే ఇద్దరు కార్మికులు అతడిని రక్షించేందుకు ట్యాంక్‌లోకి దూకారు. వారు కూడా విష వాయువు బారిన పడి మృతి చెందారు. వెంటనే అప్రమత్తమైన కార్తీక్ అనే తోటి కార్మికుడు.. అధికారులకు సమాచారం అందించాడు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని శివకుమార్‌ను రక్షించారు. 108 రాకపోవడంతో, ద్విచక్ర వాహనంపై ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సరైన భద్రత పరికరాలు ఇవ్వకుండానే ట్యాంక్ లోపలికి పంపించారని మృతుల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రమాదంపై విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనీష్ సేగర్ తెలిపారు. విచారణలో అవకతవకలకు పాల్పడినట్లు తేలితే కాంట్రాక్టర్ కాంట్రాక్టును రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

Also Read

Johnny Depp: మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన స్టార్ హీరో..

Beauty Tips for summer: ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా.. అయితే ఇలా చేయండి..!

Ukraine love story: ఉక్రెయిన్‌ అమ్మాయికి.. ఢిల్లీ అబ్బాయికి ప్రేమ పెళ్ళి! వచ్చేప్పుడు ఆమె తెచ్చిన వస్తువులు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!