Beauty Tips for summer: ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా.. అయితే ఇలా చేయండి..!
వేసవిలో పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, విటమిన్ B7 పుష్కలంగా ఉంటాయి. పెరుగు జుట్టుకి చాలా మేలు చేస్తుంది. దీనిని వెంట్రుకలకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా తయారవుతుంది. అంతేకాదు.
వేసవిలో పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, విటమిన్ B7 పుష్కలంగా ఉంటాయి. పెరుగు జుట్టుకి చాలా మేలు చేస్తుంది. దీనిని వెంట్రుకలకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా తయారవుతుంది. అంతేకాదు. పెరుగులో ఉండే విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు చుండ్రు, దురదలను తొలగిస్తాయి. పెరుగు సహజ కండీషనర్‌గా పనిచేస్తుంది. అందుకే వారానికి రెండుసార్లు పెరుగును తప్పనిసరిగా జుట్టుకి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ నూనె, తేనె కూడా జుట్టుకు మేలు చేస్తాయి. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టుని పొడిబారకుండా చేస్తాయి. ఇందుకోసం మీరు అరకప్పు పెరుగు తీసుకుని అందులో 3 చెంచాల తేనె, 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి, ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేయాలి. అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి.2 టీస్పూన్ల తేనెలో కొద్దిగా నిమ్మరసం, 1 టీస్పూన్ తేనె కలిపి, ఈ పేస్ట్‌ను జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. అంతేకాదు పోషకాలు జుట్టు మూలాల్లోకి చేరి, పొడిబారి, నిర్జీవంగా తయారైన జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. కొబ్బరి నూనెతో కలిపి కూడా పెరుగు అప్లై చేయవచ్చు. ఇది జుట్టుకు మంచి కండిషనింగ్ ఇస్తుంది. లోపలి నుంచి జుట్టుకి మంచి తేమనిస్తుంది. ఇందుకు 2 టీస్పూన్ల పెరుగు, 1 టీస్పూన్ తేనె, కొబ్బరి నూనె బాగా కలిపి, జుట్టుకి పట్టించి బాగా మసాజ్ చేసి కాసేపు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. దీనివల్ల జుట్టుకి మంచి షైనింగ్ వస్తుంది. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
David Warner-Pushpa: వారేవా..! మ్యాచ్ మధ్యలో పుష్ప సినిమా చూపించిన డేవిడ్ భాయ్.. తగ్గేదే లే..
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..