IPL 2022: కెప్టెన్ అయితే నువ్వేమైనా తోపా.. నెటిజన్ల ఫైర్.. ఎందుకంటే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022) సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ టీం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓటమిని చవిచూసింది. సోమవారం జరిగిన ఈ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా ఆడి, విజయం సాధించింది.

Anil kumar poka

|

Apr 22, 2022 | 9:26 AM


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022) సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ టీం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓటమిని చవిచూసింది. సోమవారం జరిగిన ఈ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా ఆడి, విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టీం వరుసగా తన రెండో విజయాన్ని నమోదు చేసింది. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ టీం మూడు విజయాల తర్వాత ఓటమిపాలైంది. తన కెరీర్‌లో తొలిసారిగా ఐపీఎల్ ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తున్న హార్దిక్.. ఇప్పటివరకు బాగానే ఆకట్టుకుంటున్నాడు. అయితే, ఓ విషయంలో మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇప్పటి వరకు దిగ్గజ కెప్టెన్లే ఇలా చేయలేదంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ధోనీ, కోహ్లీ, రోహిత్ లాంటి వారు కూడా ఇలా ప్రవర్తించలేదు, నువ్వు ఓ సీనియర్ ఆటగాడిని అలా అరవడం ఏం బాగోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.గుజరాత్ అందించిన టార్గె‌ట్‌ను చేరుకునే క్రమంలో కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ బ్యాట్‌తో ఆకట్టుకోవడంతో ఆట నెమ్మదిగా హైదరాబాద్ ఒడిలోకి చేరిపోయింది. ఓ సందర్భంలో, సీనియర్ పేసర్ మహమ్మద్‌పై హార్దిక్ తన నిగ్రహాన్ని కోల్పోయాడు. అది కూడా చాలా కష్టమైన క్యాచ్‌ అని తెలిసి కూడా తను నోరు పారేసుకున్నాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సమయంలో 13వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. గుజరాల్ సారథి హార్దిక్‌ ఈ ఓవర్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. విలియమ్సన్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి థర్డ్ మ్యాన్‌లో ఓషాట్ ఆడాడు. అయితే మహ్మద్ షమీ.. క్యాచ్ పట్టేందుకు ప్రయత్నం చేయలేదంటూ హార్దిక్‌ ఆగ్రహానికి గురయ్యాడు.అప్పటికే భారీగా పరుగులు సమర్పించుకోవడంతో ప్రస్టేషన్‌ను షమీపై చూపిస్తూ.. అకారణంగా అరిచాడంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈమేరకు ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. సీనియర్ స్థాయి ఉన్న ఆటగాడిపై తిట్ల వర్షం కురిపించడమేంటంటూ గుజరాత్ సారథిపై పలు విమర్శలు చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

David Warner-Pushpa: వారేవా..! మ్యాచ్ మధ్యలో పుష్ప సినిమా చూపించిన డేవిడ్ భాయ్.. తగ్గేదే లే..

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu