Viral Video: దారి తప్పిన తాబేలుకు మానవ సహాయం.. మనసు దోచేస్తున్న వీడియో
దారితప్పి జనావాసాల్లోకి చేరిన జంతువులు, గాయాలపాలై కిందపడే పక్షులను చేరదీసి, వాటిని తిరిగి మునుపటిలా తిరిగేలా చికిత్స అందించిన విషయాలు మనకు తెలిసినవే. ఇలాంటి పనులు చేయడం వల్ల మనకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది....
దారితప్పి జనావాసాల్లోకి చేరిన జంతువులు, గాయాలపాలై కిందపడే పక్షులను చేరదీసి, వాటిని తిరిగి మునుపటిలా తిరిగేలా చికిత్స అందించిన విషయాలు మనకు తెలిసినవే. ఇలాంటి పనులు చేయడం వల్ల మనకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. ఇలాంటిదే.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీటిలో నుంచి నేలపైకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నారో హెడ్ సాఫ్ట్ షెల్ తాబేలును కొందరు అధికారులు గుర్తించారు. వారు తాబేలును రక్షించి, తిరిగి నీటిలో విడిచిపెట్టారు. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతరించిపోతున్న జీవ జాతులను రక్షించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటివరకు 24,000 వీక్షణలు పొందింది. చాలా మంది నెటిజన్లు ఈ పోస్ట్ ను వివిధ గ్రూపులకూ పోస్ట్ చేశారు. “పరిరక్షణకు మీ సేవ గొప్పది, ప్రశంసనీయమైనది” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
This massive Narrow Headed Shoftshell turtle was timely rescued. Endangered & a massive female. After treatment released successfully by our team in deep water. pic.twitter.com/VM16EdnV9G
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 20, 2022
Also Read
Priyanka Chopra: పుట్టిన మూడు నెలల తర్వాత కూతురుకు నామకరణం చేసిన ప్రియాంక.. ఏం పేరు పెట్టిందంటే..