Multibagger Stocks: వరుస లాభాలతో దూసుకుపోతున్న మల్టీబ్యాగర్ స్టాక్.. డబుల్ టార్కెట్ ఇచ్చిన బ్రోకరేజ్ కంపెనీలు..

Multibagger Stocks: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ కంపెనీ స్టాక్ విలువ రోజురోజుకూ అమాంతం పెరుగుతోంది. బ్రోకరేజీలు దీని ధరపై బుల్లిష్ వ్యూవ్ కొనసాగిస్తున్నాయి. క్రూడ్ ఆయిర్ రిఫైనింగ్ వ్యాపారంలో ఉన్న ఈ కంపెనీలో మీకు వాటాలు ఉన్నాయా...

Multibagger Stocks: వరుస లాభాలతో దూసుకుపోతున్న మల్టీబ్యాగర్ స్టాక్.. డబుల్ టార్కెట్ ఇచ్చిన బ్రోకరేజ్ కంపెనీలు..
Stock market
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 22, 2022 | 10:59 AM

Multibagger Stocks: స్టాక్ మార్కెట్లలో మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోసం ఇన్వెస్టర్లు తరచూ వెతుకుతుంటారు. ఎందుకంటే అవి ఎంత రిస్క్ కలిగి ఉంటాయో అదే విధంగా ఊహించని విధంగా లాభాలను కూడా అందిస్తుంటాయి. ఒక్కోసారి కొన్ని స్టాక్స్ మీ పెట్టుబడి విలువలను అమాంతం వందల శాతం మేర పెంచేస్తుంటాయి. మీ ఊహకు అందని లాభాలను కూడా అందిస్తుంటాయి. అలాంటి స్టాక్స్ తమ పోర్టుఫోలియోలో(Portfolio) ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటుంటారు. అలాంటి కోవకు చెందినదే క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ వ్యాపారంలో ఉన్న.. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ (MRPL) కంపెనీ షేర్లు. బుధవారం ట్రేడింగ్ సెషన్ లో ఈ కంపెనీ షేర్లు BSEలో 13 శాతం మేర లాభపడింది. ఈ పెరుగుదల వల్ల షేరు మూడేళ్ల గరిష్ఠమైన రూ.65.45 కు చేరుకుంది. రెండు ట్రేడింగ్ సెషన్లలో.. ఈ స్టాక్‌లో ఏకంగా 24 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గడచిన రెండు వారాల ట్రేడింగ్‌లో MRPL స్టాక్ 58 శాతం మేర ఎగబాకగా.., సెన్సెక్స్ మాత్రం 2.7 శాతం నష్టాన్ని చవిచూసింది. మార్కెట్ క్షీణిస్తున్న సమయంలోనూ ప్రభుత్వరంగానికి చెందిన ఈ కంపెనీ అద్బుత పనితీరును కనబరిచింది.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ స్టాక్ రానున్న రోజుల్లో ఇదే జోరును కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రోకరేజీ సంస్థలు కూడా ఈ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నాయి. బ్రోకరేజ్ హౌస్ టార్గెట్ ధరను రూ.120గా నిర్ణయించింది. ఇన్వెస్టర్లు ఈ షేర్ లో పెట్టుబడి పెడితే.., 91 శాతం వరకు రాబడిని పొందవచ్చని వారు అంటున్నారు. ఈ స్టాక్ కు డిమాండ్ పెరగడానికి ఇదొక కారణంగా తెలుస్తోంది. MRPL రిఫైనరీ దేశంలోని పశ్చిమ తీరంలో, మంగళూరు ఓడరేవుకు సమీపంలో ఉన్నందున, ముడి చమురు, ఎగుమతి చేయడం లాజికల్‌గా ఉంది,  ఉత్పత్తులు గణనీయంగా ప్రయోజనకరమైనదని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. OMPLతో MRPL విలీనం పూర్తి కానుంది. దీని వల్ల నష్టాలు తగ్గనున్నాయి.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

NOTE: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

ఇవీ చదవండి..

RBI News: క్రెడిట్ కార్డుల విషయంలో RBI కీలక ఆదేశాలు.. ఇకపై అలా చేస్తే భారీ జరిమానాలు.. కస్టమర్లకు ఊరట

Train on Road: రోడ్డుపై రైలు పరుగులు.. విద్యార్ధుల కోసం ఓ స్కూలు యాజమాన్యం వినూత్న ప్రయోగం

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ