Train on Road: రోడ్డుపై రైలు పరుగులు.. విద్యార్ధుల కోసం ఓ స్కూలు యాజమాన్యం వినూత్న ప్రయోగం

Train on Road: రైలు ప్రయాణం(Train Journey) ఒక అందమైన అనుభవం.. చిన్నా పెద్ద ప్రతి ఒక్కరూ రైళ్లలో ప్రయాణించాలని కోరుకుంటారు. అందుకనే పార్కులు (Parks), జూలు(Zoo) వంటి ప్రదేశాల్లో ..

Train on Road: రోడ్డుపై రైలు పరుగులు.. విద్యార్ధుల కోసం ఓ స్కూలు యాజమాన్యం వినూత్న ప్రయోగం
Train Road
Follow us

|

Updated on: Apr 22, 2022 | 10:06 AM

Train on Road: రైలు ప్రయాణం(Train Journey) ఒక అందమైన అనుభవం.. చిన్నా పెద్ద ప్రతి ఒక్కరూ రైళ్లలో ప్రయాణించాలని కోరుకుంటారు. అందుకనే పార్కులు (Parks), జూలు(Zoo) వంటి ప్రదేశాల్లో చిన్న చిన్న రైళ్లను ఏర్పాటు చేసి.. పర్యాటకులను ఆకట్టుకుంటారు. అదే రైలు సౌకర్యం ప్రతి ప్రాంతానికి కల్పించాలంటే..ఎన్నో వ్యయప్రయాలు. దీంతో చాలా ప్రాంతాలకు రైలు సౌకర్యం తీరని కలగా మిగిలిపోతుంది. అదే విధంగా ఆ జిల్లా ప్రజలకు రైలు ప్రయాణం కల. అయితే కొన్నేళ్లుగా ఆ కల కలగానే మిగిలిపోయింది. అయితే వీరి కల నెరవేరుస్తూ ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం రహదారులపై రైలును పరుగులు పెట్టించారు. ఇదేంటి రహదారిపై రైలు పరుగులేంటి.. పట్టాలపై కదా రైలు దూసుకుపోయేది అనుకుంటున్నారా.. ఇది పట్టాలపై నడిచే రైలు కాదండి… రోడ్డుపై నడిచే రైలు.. అదే.. రైలులా ఉండే వాహనం.

విద్యార్ధులకు మానసిక ఆనందం, వాహనాలపై అవగాహన కల్పించడానికి నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఈ రైలులాంటి వాహనంలో విద్యార్ధులను ఎక్కించుకొని నగర వీధుల్లో తిప్పుతున్నారు. అచ్చం రైలులా కనిపించే ఈ వాహనానికి ముందు ఇంజిన్‌, వెనుక 3 బోగీలు ఏర్పాటు చేసారు. అయితే ఈ వాహనానికి కార్లకు ఉండే చక్రాలు అమర్చడంతో దీనికి పట్టాలు అవసరం లేదు. ఈ వాహనం ఇప్పుడు భైంసా పట్టణంలోని రహదారులపై రైలు పరుగులు పెడుతూ సందడి చేస్తుంది అది చూసి పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగానైనా తమ కల నెరవేరిందని పట్టణ ప్రజలు హర్షం తెలియజేస్తున్నారు.

Also Read: Tirumala: శ్రీవారి ఆలయంలో ఒక మూలకు వచ్చేసరికి.. చాలా మంది భక్తులు.. ఆగి.. తలెత్తి.. చూస్తుంటారు ఎందుకంటే

Viral Video: రోడ్డు వేయమని అడిగినందుకు.. యువకుడి చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..