AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal News: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి పరార్

Warangal Love Incident: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. గోపాలపూర్‌లో అనూష అనే విద్యార్థిని గొంతు కోసి పరారయ్యాడు. కాకతీయ యూనివర్సిటీలో MCA ఫైనల్ ఇయర్ చదువుకుంటున్న అనూషను...

Warangal News: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి పరార్
crime news
Ganesh Mudavath
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 22, 2022 | 7:07 PM

Share

Warangal Crime News: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన అనూష అనే విద్యార్థిని గొంతు కోసి పరారయ్యాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్న అనూషను అజహర్ అనే యువకడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతని ప్రేమను అనూష నిరాకరించడంతో తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు. కత్తితో గొంతు కోశాడు. అనంతం అక్కడి నుంచి పరారయ్యాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. తనను ప్రేమించలేదనే కోపంతో యువతిపై అజహర్ కక్ష పెంచుకున్నాడు. ప్రేమిస్తావా చస్తావా అంటూ బెదిరించాడు. అయినప్పటికీ అతని ప్రేమను అంగీకరించలేదని ప్రాణాలు తీసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. యువతులను ప్రేమ పేరుతో వేధించే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలోనూ వరంగల్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రేమోన్మాది యువతి గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశాడు. హన్మకొండలోని రాంనగర్‌లో హారతి, షాహిద్ సహజీవనం చేస్తున్నారు. కొంత కాలంగా హారతి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న షాహిద్ ఆమెపై బ్లేడ్‌తో దాడి చేశాడు. పదునైన బ్లేడ్‌తో గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై హారతి చనిపోయింది. ఘటన అనంతరం నిందితుడు షాహిద్ జడ్జి ముందు లొంగిపోయాడు. జడ్జి అతన్ని పోలీసులకు అప్పగించారు.

వరంగల్ తాజా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read

Johnson-Modi Meet: నా స్నేహితుడితో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నా.. బ్రిటన్ ప్రధాని ట్వీట్

Tollywood : మాస్ దర్శకులంతా తమ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్‌ ఎలా మిస్ అవుతున్నారబ్బా.!!

IPL 2022: 139 కి.మీ. స్పీడ్‌తో బుల్లెట్ లాంటి యార్కర్‌.. దెబ్బకు వికెట్లతో సహా స్టార్‌ ఆటగాడు ఎలా కింద పడిపోయారో మీరే చూడండి..