Tirumala: శ్రీవారి ఆలయంలో ఒక మూలకు వచ్చేసరికి.. చాలా మంది భక్తులు.. ఆగి.. తలెత్తి.. చూస్తుంటారు ఎందుకంటే

Tirumala: శ్రీవెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swami) కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati). అనేక వింతలు, విశేషాలకు ఆలవాలయం. స్వామివారిని దర్శించుకోవాలని దేశ విదేశాలనుంచి..

Tirumala: శ్రీవారి ఆలయంలో ఒక మూలకు వచ్చేసరికి.. చాలా మంది భక్తులు.. ఆగి.. తలెత్తి.. చూస్తుంటారు ఎందుకంటే
Vimana Venkateswara Swamy
Follow us
Surya Kala

|

Updated on: Apr 22, 2022 | 9:41 AM

Tirumala: శ్రీవెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swami) కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati). అనేక వింతలు, విశేషాలకు ఆలవాలయం. స్వామివారిని దర్శించుకోవాలని దేశ విదేశాలనుంచి భారీ సంఖ్యలో వస్తారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. కొండమీద ప్రతి ఒక్క నిర్మాణానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అయితే స్వామివారి క్షేత్రంలో, ఆలయంలో ఉన్న ప్రాంతాలు, నిర్మాణంలో ఉన్న విశేషాలు చాలా మంది భక్తులకు తెలియదు. ఈ నేపథ్యంలో తిరుమల క్షేత్రంలోని స్వామివారి ఆలయం మీద దర్శనమిచ్చే విమాన వెంకటేశ్వర స్వామి (Vimana Venkateswara Swami) గురించి ఈరోజు తెలుసుకుందాం..

కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడిని దర్శనం చేసుకుని.. బయటకు వచ్చిన అనంతరం స్వామివారి తీర్ధం, శఠారి తీసుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుని.. బయటకు నడుస్తుంటే.. ఆలయంలో ఒక మూలకు వచ్చేసరికి.. చాలా మంది భక్తులు.. ఆగి.. తలెత్తి.. చూస్తుంటారు. భక్తులు అక్కడ దర్శించుకునేది విమాన వేంకటేశ్వర స్వామిని.

శీవారి ఆలయ గోపురం పేరు “ఆనందనిలయం”.. ఈ బంగారు గోపురం మూడు అంతస్తులుగా వుంటుంది. గోపురం ఎత్తు, కలశంతో కలిపి.. 65అడుగుల 2 అంగుళాలు. మొదటి అంతస్థులో లతలు, తీగలు, మకరతోరణాలు వంటివి కనిపిస్తాయి. ఇక మూడవ (గుండ్రని) అంతస్తు లో 20 బొమ్మలు వుంటాయి.  మహపద్మం, 8 సింహాలు. అయితే గోపురం రెండో అంతస్థులో మకర తోరణాలతో పాటు దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. నరసింహస్వామి, వరాహస్వామి, అనంతుడు, వైకుంఠనాథుడు, ఇంకా అనేక విష్ణురూపాలు, జయ విజయులు, విష్వక్సేనుడు.. ఇలా మొత్తం 40 దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. అంతేకాదు ఆలయంలో రెండో అంతస్థు వాయవ్యం మూల.. ఉత్తరముఖంగా విమాన వేంకటేశుడు ఉంటారు.  ఈయన పక్కన బాల కృష్ణుడు, గరుత్మంతుడు, ఆంజనేయస్వామి వుంటారు .

గోపురంలో..వెండి మకరతోరణంలో..వెలిగిపోతున్న స్వామియే..విమాన వేంకటేశ్వరుడు. లోపల వున్న మూలమూర్తిని పోలివుంటారు. దీంతో లోపల వున్న వెంకన్న దర్శనం బాగా అవలేదే అని మధన పడే  భక్తులకు స్వాంతన ఇచ్చే స్వామి విమానా వెంకటేశ్వర స్వామి. అంతేకాదు ఈ విమాన వేంకటేశుడి దర్శనం .. తిరుపతి యాత్రా ఫలితం ఇస్తుంది అని భక్తుల నమ్మకం.  16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు విమాప వెంకటేశ్వరుడిని ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం. ఈ విమాన వేంకటేశ్వరుణ్ణి భక్తులందరూ సులభంగా గుర్తించేందుకు వీలుగా టి.టి.డి ఆలయాల ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా పనిచేసిన పి.వి.ఆర్.కె.ప్రసాద్ ఒక వెండి తోరణాన్ని తయారు చేయించి.. ఈ విగ్రహానికి అతికించారు. కనుక స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చే ముందు.. విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Read Also: Johnson-Modi Meet: నేడు ప్రధాని మోడీతో భేటీ కానున్న బ్రిటన్ ప్రధాని.. తాము రష్యా.. భారత్‌ల ప్రత్యేక బంధాన్ని అర్ధం చేసుకున్నామన్న బోరిస్

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?