Vastu Tips: ఇంట్లో ఆర్ధిక, ఆరోగ్య సమస్యల.. ఇంట్లో ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..

Vastu Tips: వాస్తులో దిశలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంటి దిశలో పెట్టుకునే వస్తువులు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చుపిస్తాయని వాస్తుశాస్త్రం (Vastu shastra)పేర్కొంది. ఇంట్లో పెట్టుకునే వస్తువుల స్థానం..

Vastu Tips: ఇంట్లో ఆర్ధిక, ఆరోగ్య సమస్యల.. ఇంట్లో ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..
Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Apr 22, 2022 | 11:07 AM

Vastu Tips: వాస్తులో దిశలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంటి దిశలో పెట్టుకునే వస్తువులు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చుపిస్తాయని వాస్తుశాస్త్రం (Vastu shastra)పేర్కొంది. ఇంట్లో పెట్టుకునే వస్తువుల స్థానం బట్టి సానుకూల,  ప్రతికూల శక్తి రెండూ వెలువడతాయి.  కుటుంబంలో నివసించే వ్యక్తులపై మంచి, చెడు ప్రభావం చూపుతుంది. చాలా సార్లు ఇంట్లో కలహాలు,  ప్రతికూలత, విభిన్న వాతావరణం ఉంటుంది. దీని వెనుక ఇంటి వాస్తు దోషాలు కూడా కారణం కావచ్చు. ఈ వాస్తు దోషాలను వదిలించుకోవడానికి, మీరు వివిధ వాస్తు చిట్కాలను అనుసరించవచ్చు. వాస్తు దోషం (Vastu Tips for career ) కారణంగా, ఆర్థిక, శారీరక సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. వాస్తు దోషాలను తొలగించడానికి ఈ సింపుల్ చిట్కాలను తెలుసుకుందాం..

మొక్కలు, పువ్వులు: మొక్కలు ఇంటికి అదృష్టాన్ని, సానుకూల శక్తిని ఇస్తాయని నమ్ముతారు. ఇంట్లో వెదురు, తులసి, తామర, మల్లె వంటి మొక్కలను పెంచుకోవచ్చు. ఇవి చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.  శ్రేయస్సును ఇస్తాయి.  ఆకర్షిస్తారు. ఆకుపచ్చ లేదా నీలం పూల కుండను ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ఉంచవచ్చు. మీరు నైరుతి మూలకు పసుపు పూల కుండను ఉంచవచ్చు.

అద్దం: మంచి వ్యాపార అభివృద్ధి కోసం .. ఆఫీసులో అద్దం ఉంచండి. మీరు ఈ అద్దాన్ని ఉత్తరం లేదా పడమర దిశలో పెట్టుకోవాలి.

ఇంట్లో దీపం, ధూపం: ప్రతిరోజూ ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపం, ధూపం వెలిగించండి. ఇది ప్రతికూలతను, చెడు దృష్టిని తొలగిస్తుంది.  ఆగ్నేయంలో దీపాన్ని ఉంచండి. చేపట్టిన పనిలో విజయాన్ని సొంతం చేస్తుంది.

వాటర్ ఫౌంటెన్, అక్వేరియం: వాయువ్య దిశలో నీటి ఫౌంటెన్ ఉంచండి. అక్వేరియం ఇంటికి ఈశాన్య దిశలో ఉంచినట్లయితే శుభప్రదం. ఇది సానుకూల శక్తి, సంపద, శ్రేయస్సును కలిగిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండండి. లేకుంటే ఆర్థిక వృద్ధికి, అవకాశాలకు ఆటంకం కలిగిస్తుంది.

కృత్రిమ మనీ బౌల్ , జెమ్ స్టోన్ ట్రీ: ఆనందం, శ్రేయస్సు కోసం ఇంట్లో కృత్రిమ మనీ బౌల్ లేదా జెమ్ స్టోన్ ట్రీ సానుకూల ఫలితాలను ఇస్తుంది.

నేమ్ ప్లేట్: ఇంటి బయట నేమ్‌ ప్లేట్‌ పెట్టుకోవాలి. ఇది చాలా ప్రయోజనకరం. ఇది సానుకూలతను తెలియజేస్తుంది.

ఉప్పు: నీళ్లలో ఉప్పు కలిపి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.  అంతేకాదు ఇంటి మూలల్లో ఉప్పు కళ్ళను ఉంచవచ్చు. అవి ప్రతికూలతను తొలగిస్తాయి.

Note: (ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం ఆధారంగా ఇచ్చింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Read Also: Raw Mango Juice: సమ్మర్ సూపర్ డ్రింక్.. పచ్చిమామిడితో షరబత్.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. తయారీ విధానం..