AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్డు వేయమని అడిగినందుకు.. యువకుడి చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే

గ్రామంలో రోడ్లు బాగు చేయాలని, నీటి సమస్యలు పరిష్కరించాలని కోరిన ఓ యువకుడి చెంప చెల్లుమనిపించారు ఓ ఎమ్మెల్యే. అంతేకాదు పోలీసులకు పట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు.

Viral Video: రోడ్డు వేయమని అడిగినందుకు.. యువకుడి చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే
Mla Slaps Young Man
Ram Naramaneni
|

Updated on: Apr 22, 2022 | 9:16 AM

Share

Trending Video: ఎలక్షన్లలో గెలుపు కోసం ఎన్నో హామీలు ఇస్తారు. తీరా గెలిచాక ఆ హామీలు నెరవేర్చమంటే ఆగ్రహిస్తారు. అవసరమైతే దాడి కూడా చేస్తాం అన్నట్టుగా ఉంది కొంత మంది ప్రజా ప్రతినిధుల తీరు. రోడ్డు వేయమని అడిగినందుకు కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే యువకుడి చెంప చెల్లుమనిపించడం వివాదాస్పదంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలానికి సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక(Karnataka)తూముకూరు జిల్లా పావగడ  కాంగ్రెస్ ఎమ్మెల్యే(Pavagada Congress MLA )వెంకటరమణప్ప.. తన నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటనకు వెళ్లారు. ఓ గ్రామంలోని యువకుడు.. ఎమ్మెల్యేను నిలదీశాడు. రోడ్డు వేయిస్తానని మాట ఇచ్చి ఓట్లు వేయించుకొన్నారు.. ఇంతకువరకు రోడ్డు ఎందుకు వేయలేదని ప్రశ్నించాడు. దీంతో  ఆగ్రహించిన ఎమ్మెల్యే యువకుడిపై చేయిచేసుకున్నారు. అంతేకాదు కాదు.. భూతులు తిడుతూ.. పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న ప్రజలు, అధికారులు అవాక్కయ్యారు .ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చాలా పెద్దాయన అని.. అందుకే తనను కొట్టినా వదిలేశానని, తనకేం భయం లేదని ఆ యువకుడు చెప్పాడు.

Also Read:  నిప్పులు చిమ్ముతున్న భానుడు.. ఎండల తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, పిల్లలకు వాతావరణ శాఖ అలెర్ట్

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?