Corona Crisis: పుట్టినిల్లు చైనాని వణికిస్తోన్న కరోనా.. షాంఘైలో ఆహారపు కొరత.. మరోవైపు పెరుగుతున్న మానసిక ఆరోగ్య బాధితులు

Corona Crisis: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో(China) ఓ రేంజ్ లో విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీగా కేసులు నమోదవుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కోవిడ్ 19 (Covid 19) ఫస్ట్ వేవ్ కంటే..

Corona Crisis: పుట్టినిల్లు చైనాని వణికిస్తోన్న కరోనా.. షాంఘైలో ఆహారపు కొరత.. మరోవైపు పెరుగుతున్న మానసిక ఆరోగ్య బాధితులు
China Corona Crisis
Follow us

|

Updated on: Apr 22, 2022 | 11:45 AM

Corona Crisis: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో(China) ఓ రేంజ్ లో విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీగా కేసులు నమోదవుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కోవిడ్ 19 (Covid 19) ఫస్ట్ వేవ్ కంటే.. ఫోర్త్ వేవ్ లో ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో నాల్గో దశ మొదలైంది.. అధికారులు చర్యలు తీసుకుంటున్నా… చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ పాటిస్తున్నా.. ఎక్కడా కరోనా వ్యాప్తి అడ్డు కట్టపడడంలేదు.  ముఖ్యంగా చైనా తూర్పు ప్రాంతంలో కరోనా వైరల్ విఆలయతాండవం చేస్తోంది. చైనా ఆర్ధిక రాజధాని షాంఘైలో కరోనా పాజిటివ్ భారీగా నమోదవుతున్నాయి. ఈ పట్టణంలో రెండున్నర కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. దీంతో లాక్ డౌన్ విధించారు. కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. షాంఘైలో మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 3 లక్షల 90 వేల మంది కరోనా బారిన పడ్డారు. గత 40 రోజులుగా ఇక్కడ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నగరాన్ని నిర్బంధించారు.. సూపర్ మార్కెట్లు, ఆహార కేంద్రాల సహా మూసివేశారు. దీంతో ఇక్కడ ప్రజలు నిత్యావసర వస్తువుల కొరతను ఎదుర్కొంటున్నారు.

నిల్వ ఉన్న కాస్త ఆహార పదార్ధాలు సైతం నిండుకోవడంతో షాంఘై నగరంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఆహారం కోసం ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారు. అధికారులు కూడా ఇక్కడ ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర ప్రజల దీన దుస్థిని తెలియజేసే విధంగా దృశ్యాలు ఇటీవల అంతర్జాతీయ మీడియాకు చిక్కాయి.

అయితే ప్రజల పరిస్థితి ఇలాగే ఇంకొన్ని రోజులు కొనసాగితే.. ప్రభుత్వంపై ప్రజలు తిరుబాటు చేస్తారంటూ.. అధికారులు ఆలోచిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మరికొన్ని రోజుల్లో షాంఘై నగరంలో దశలవారీగా లాక్ డౌన్ ను సడలించడానికి అధికారులు రెడీ అయ్యారు. నగర జనాభా మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్రమంగా క్వారంటైన్ కేంద్రాలను ఎత్తివేయనున్నారు.  చైనా తూర్పు ప్రాంతంలో మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయని చైనా ఆరోగ్యశాఖ ఓ ప్రకటన వెలువరించింది.

మరోవైపు చైనాలో రోజు రోజుకీ మానసిక బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ లో ఉన్న ప్రజలు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని… తెలిపింది. 400 మిలియన్లకు పైగా పౌరులు లాక్‌డౌన్‌లో ఉన్నారని అంచనా. “సైకలాజికల్ కౌన్సెలింగ్” కోసం పరిశోధన చేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని అధికారులు తెలిపారు.

Also Read: Vastu Tips: ఇంట్లో ఆర్ధిక, ఆరోగ్య సమస్యల.. ఇంట్లో ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..

Latest Articles