Viral: చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు.. మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్తే..

అతనికి మంగళవారం సాయంత్రం గుండెపోటు వచ్చింది.. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.. చికిత్స చేసిన వైద్యులు బుధవారం ఉదయం చనిపోయినట్టు నిర్ధారించారు.. కానీ....

Viral: చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు.. మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్తే..
Bizarre Incident
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 22, 2022 | 12:16 PM

Madhya pradesh: ఒక వ్యక్తికి గత మంగళవారం సాయంకాలం సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో కంగారుపడిన ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించిన వైద్యులు.. బుధవారం ఉదయం పేషెంట్ చనిపోయినట్లు నిర్థారించారు. దీంతో కుటుంబ సభ్యుల తీవ్ర విషాదంలో మునిగిపోయారు. డెడ్‌బాడీని ఇంటికి తీసుకెళ్లి.. అంత్యక్రియుల కోసం పనులు ప్రారంభించారు. అయితే స్మశానానికి తీసుకెళ్తున్న సమయంలో.. చనిపోయాడని నిర్ధారించిన వ్యక్తి పాడెపై నుంచి ఒక్కసారిగా లేచాడు. దీంతో అక్కడున్న వాళ్లందరూ కంగుతిన్నారు. వెంటనే తేరుకున్న అతడి కొడుకు నీరు పట్టిస్తే తాగాడు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్‌కు వెళ్లేలోపు ఈసారి అతను నిజంగానే తనువు చాలించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలోని ధార్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. మ‌ృతుడు సంతోష్ 52 ఏళ్ల సంతోష్‌గా తెలిసింది. కాగా మొదట చికిత్స అందించిన ఆస్పత్రిపై మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read: Crime: బిడ్డకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక.. పోలీసుల అదుపులో 12 ఏళ్ల బాలుడు

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!