AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Johnson-Modi Meet: భారత్‌ పర్యటనపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సంతృప్తి.. మోడీతో భేటీ.. కీలక ఒప్పందాలు

Boris Johnson-Narendra Modi Meet: భారత్‌లో బ్రిటన్‌ ప్రధాని పర్యటన రెండో రోజు కొనసాగింది. నిన్నంతా గుజరాత్‌ (Gujarat)లో పర్యటించిన బోరిస్‌ జాన్సన్‌ ..

Johnson-Modi Meet: భారత్‌ పర్యటనపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సంతృప్తి.. మోడీతో భేటీ.. కీలక ఒప్పందాలు
Subhash Goud
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 22, 2022 | 8:27 PM

Share

Boris Johnson-Narendra Modi Meet: భారత్‌లో బ్రిటన్‌ ప్రధాని పర్యటన రెండో రోజు కొనసాగింది. నిన్నంతా గుజరాత్‌ (Gujarat)లో పర్యటించిన బోరిస్‌ జాన్సన్‌ ఇవాళ ఉదయం ఢిల్లీ (Delhi) చేరుకున్నారు.. ప్రధాని మోడీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌లో బ్రిటన్‌ ప్రధానికి అధికార లాంఛనాలతో స్వాగతం లభించింది. అంతకుముందు రాజ్‌ఘాట్‌ను సందర్శించిన బ్రిటన్‌ ప్రధాని.. మహాత్మా గాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ప్రధాని మోడీల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.. ఇరు దేశాలకు అధికారులు పాల్గొన్న ఈ భేటీలో రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ప్రధానులు మీడియాతో మాట్లాడారు..

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలోనే బ్రిటన్‌ ప్రధాని భారత పర్యటనకు రావడం చారిత్రకమన్నారు భారత ప్రధాని మోడీ. రక్షణ రంగం, వాణిజ్యం, వాతావరణం, ఇంధనం వంటి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతా సహాకారంపై ప్రధానంగా దృష్టి పెడతామన్నారు మోదీ. ఉక్రెయిన్​లో దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించువాలని కోరుతున్నామన్నారు. ఉక్రెయిన్​సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుతున్నామన్నారు.

భారత్‌ పర్యటనపై బోరిస్‌ జాన్సన్‌ సంతృప్తి:

భారత్‌లో తన పర్యటనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలోకన్నా మరింత మెరుగ్గా ఉన్నాయన్నారు. ఈ పర్యటనలో తమ బంధం మరింత బలపడిందన్నారు బ్రిటన్‌ ప్రధాని. ఇండో పసిఫిక్ ప్రాంతంలో బెదిరింపులు, పెరిగాయని పేర్కొన్న బోరిస్‌.. ఈ ప్రాంతాన్ని స్వేచ్ఛగా ఉంచడం ఉమ్మడి లక్ష్యమన్నారు.

భారత్‌లో ఆర్ధిక నేరాలకు బ్రిటన్‌లో తలదాచుకుంటున్న నీరవ్ మోదీ, విజయ్ మాల్యా ప్రస్థావన కూడా వచ్చింది. భారత్‌లో చట్టాల నుంచి రక్షించుకోవడానికి తమ దేశ న్యాయవ్యవస్థను వాడుకోడానికి అంగీకరించబోమన్నారు బోరిస్ జాన్సన్‌. ఇరు దేశాల ప్రధానుల భేటీలో ఉగ్రవాదం, భారత్‌లో పెట్టుబడులు, బ్రిటన్‌లోని భారతీయులకు వీసాల సడలింపు వంటి అంశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.

అలాగే ఉక్రెయిన్‌ పరిణామాలను పక్కన పెట్టి రక్షణ, వాణిజ్య, పర్యావరణ, ఇంధన అంశాల్లో ఇరు దేశాల సహకారం మైత్రిపై దృష్టి పెట్టారు భారత్‌-బ్రిటన్‌ ప్రధానులు. భారత్‌లో తమ బంధం మరింత బలపడిందంటున్నారు బోరిస్‌ జాన్సన్‌. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతా సహాకారంపై ప్రధానంగా చర్చించామన్నారు మోడీ. భారత్‌లో రెండు రోజల పాటు జరిపిన బ్రిటన్‌ ప్రధాని పర్యటన ముగిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

America Strong Warning: చైనాకు మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన అమెరికా.. ఎందుకంటే..

Swapping Policy: ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర సర్కార్‌ శుభవార్త.. ఏంటంటే..!