Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కలకలం.. పుల్వామా తరహా అటాక్‌కు స్కెచ్.. షాకింగ్ స్టోరీ..!

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మరో టెర్రర్ అటాక్..! గత నెల రోజులుగా అక్కడ పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నాయి...

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కలకలం.. పుల్వామా తరహా అటాక్‌కు స్కెచ్.. షాకింగ్ స్టోరీ..!
Encounter
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 22, 2022 | 6:10 PM

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మరో టెర్రర్ అటాక్..! గత నెల రోజులుగా అక్కడ పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఏదో ఒక చోట ఇలాంటి టెన్షన్ క్రియేట్ అవుతూనే ఉంది. నాన్‌లోకల్స్‌, పొలిటికల్ లీడర్స్, ఒక వర్గం టార్గెట్‌గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ సుంజ్వాన్‌ కంటోన్మెంట్ ఏరియాలో జరిగిన అటాక్ మాత్రం వీటన్నింటికీ భిన్నమైంది. పైగా ప్రధాని నరేంద్ర మోదీ టూర్‌కు ముందు జరగడంతో ప్రధాన అంశంగా మారింది.

జమ్ములో ఉగ్రదాడి జరగబోతోందని ఇంటిలిజెన్స్‌కు ముందుగానే ఉప్పందింది.! ఆదివారం ప్రధాని మోదీ వస్తుండటంతో సెక్యూరిటీ ఫోర్స్ వెంటనే అప్రమత్తం అయింది. సుంజ్వాన్‌ కంటోన్మెంట్ ఏరియాలో కార్డన్‌ సెర్చ్ చేప్టటింది. ఈ టైమ్‌లో టెర్రరిస్టులు రివర్స్ అటాక్‌కు ప్లాన్ చేశారు. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను తరలిస్తున్న బస్సు టార్గెట్‌గా ఏకంగా గ్రనేడ్ లాంఛర్‌తో విరుచుకుపడ్డారు. అంటే సేమ్‌ మరో పుల్వామా తరహా దాడి చేయాలనుకున్నారు. కానీ భద్రతా బలగాలు తిప్పికొట్టడంతో ఆ కుట్ర భగ్నం అయింది.

ఇప్పుడు జమ్మూ అంతా హైఅలెర్ట్ కొనసాగుతోంది. ఇంటర్నెట్, మొబైల్‌ సర్వీసుల్ని నిలిపివేసి ఉగ్రవేట కొనసాగిస్తున్నారు. డ్రోన్లను రంగంలోకి దింపి మొత్తం అణువణువూ జల్లెడ పడుతున్నారు. ఇక బారాముల్లాలోనూ మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో సడెన్‌గా ఎందుకీ కల్లోలం..? ముష్కర మూకలు మళ్లీ ఒక్కసారిగా ఎందుకు రెచ్చిపోతున్నాయి. గత నెలరోజులుగా జరుగుతున్న వరుస సంఘటనలు దేనికి సంకేతం.?

ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే.. 2019 ఆగస్టు 6. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేసిన రోజు.. రాష్ట్ర హోదాను తొలగించి.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలు… జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌గా విభజించిన సమయం. దాదాపు 3 సంవత్సరాలు కావస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌ టూర్‌కు వెళ్తుండటం ఇదే తొలిసారి. ఏప్రిల్‌ 24న జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం. జమ్మూలోని సాంబా జిల్లా పల్లీ విలేజ్‌ నుంచి గ్రామీణ స్థానిక సంస్థలను ఉద్దేశించి మోదీ మాట్లాడనున్నారు. ఇది షెడ్యూల్డ్ ప్రోగ్రామ్. సరిగ్గా ఈ టూర్‌కు ముందు జమ్ములో టెర్రర్ అటాక్స్ జరగడం హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది.

జనరల్‌గా జమ్ము, కశ్మీర్‌లో పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. జమ్ములో హిందూ సిక్కుల సంఖ్య ఎక్కువ. కశ్మీర్‌లో ముస్లింల సంఖ్య ఎక్కువ. కశ్మీర్‌ ఏరియాలో జరిగే టెర్రర్ అటాక్స్ అన్నీ ఆర్మీ టార్గెట్‌గా జరుగుతుంటాయి. ఎక్కువగా చెక్‌పోస్ట్‌పై దాడులు చేసి.. బీభత్సం సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. అంటే అక్కడ ఉగ్రమూకల టార్గెట్ కేవలం భద్రతా సిబ్బందే తప్ప.. సాధారణ పౌరులు కాదు. ఇక జుమ్మూలో జరిగే దాడులు వీటికి పూర్తి భిన్నంగా ఉంటాయి. వీలైనంత మంది సామాన్య పౌరులను పొట్టనపెట్టుకోవడమే లక్ష్యంగా రెచ్చిపోతుంటారు. అందుకే రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపైనే ఫోకస్ చేస్తారు. ఇక్కడ వీళ్ల లక్ష్యం ఒక వర్గం ప్రజలు, లోకల్ పొలిటకల్ లీడర్స్.

లెటెస్ట్ అటాక్ జరిగింది కూడా జమ్మూలోనే. అదీ ప్రధాని మోదీ పర్యటనకు 2 రోజుల ముందు. అంటే ఇక్కడ వీరి టార్గెట్ క్లియర్. పీఎం టూర్‌కు ముుందు ఉనికిని చాటుకునే ప్రయత్నం జరిగిందన్నది స్పష్టం అవుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా టెర్రరిజం తగ్గలేదని.. కశ్మీరం ఇంకా రగులుతూనే ఉందని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ ఫోర్స్ కార్డన్‌ సెర్చ్ చేసింది కాబట్టి వాళ్లపై అటాక్ చేశారు. లేదంటే ఇంకా ఎక్కడో భారీ విధ్వంసానికి స్కెచ్‌ వేసే ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఇక్కడ రెండు అంశాలున్నాయి. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఉంది కేంద్రంలోని బీజేపీ సర్కారు. ఈ ప్రక్రియకు బ్రేకులు వేసి.. అల్లకల్లోలం సృష్టించేందుకు గోతికాడి నక్కలా కాపుకాస్తోంది పాకిస్థాన్. జమ్మూలో త్వరలోనే స్థానిక అభివృద్ధి మండళ్లు అంటే DDCలకు ఎన్నికల నిర్వహించాలని భావిస్తోంది కేంద్రం. అదే టైమ్‌లో నియోజకవర్గాల పునర్‌విభనజపైనా ఫోకస్ చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. త్వరలోనే జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రా హోదా ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పాకిస్థాన్ అండతో పెట్రేగిపోతున్న ముష్కర మూకలు మాత్రం రాక్షసక్రీడకు రంగం సిద్ధం చేస్తున్నాయి.

పాకిస్థాన్‌లో ప్రభుత్వాలు మారినా వారి ఆలోచనా విధానం మారదన్నది సుస్పష్టం. కొత్తగా ప్రధాని పీఠాన్ని అధిష్టించిన షెహబాజ్‌ షరీఫ్‌ కూడా అదే విషం కక్కారు. తొలిరోజు.. తొలి ప్రసంగంలోనే కశ్మీర్‌లో రక్తం ఏరులై పారుతోందని.. అక్కడి లోయలు రక్తంతో ఎరుపెక్కాయంటూ ఓ రేంజ్‌లో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడి ప్రజలపై మొసలికన్నీరు కారుస్తూ లేని ప్రేమను ఒలకపోసే ప్రయత్నం చేశారు. షరీఫ్‌ చేసిన ఈ కామెంట్స్ తర్వాత ఒక్కసారిగా టెర్రర్ అటాక్స్ పెరిగిపోవడం కూడా ప్రస్తావించాల్సిన అంశం.

పాక్‌ పన్నాగాలను ఎదుర్కొంటూ.. చైనా సన్నాయి నొక్కులను కాచుకుంటూ.. పర్యాటక స్వర్గధామం జమ్మూకశ్మీర్‌లో ప్రగతి పవనాలు వీచేలా చేయడం ఎప్పుడు కేంద్రానికి అతిపెద్ద సవాల్. ఈ లక్ష్యం దిశగా ఇప్పటికే పడిన అడుగులను.. నీరు గార్చే ప్రయత్నాలు అంతే బలంగా సాగుతుండటం కచ్చితంగా ఆందోళనకరమే.!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్..

Also read:

Realme GT 2: వార్షికోత్సవం వేళ రియల్‌‌మి బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో మార్కెట్‌లోకి రియల్‌మి జీటీ 2..

Telangana Rain Alert: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరో గంటలో నగర వ్యాప్తంగా..

Hyderabad News: క్షణికావేశంలో దారుణం.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ మహిళ ఏకంగా..