Realme GT 2: వార్షికోత్సవం వేళ రియల్‌‌మి బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో మార్కెట్‌లోకి రియల్‌మి జీటీ 2..

Realme GT 2: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మి వార్షికోత్సవం సందర్భంగా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. వార్సికోత్సవ సేల్‌లో..

Realme GT 2: వార్షికోత్సవం వేళ రియల్‌‌మి బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో మార్కెట్‌లోకి రియల్‌మి జీటీ 2..
Realme Gt2
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 22, 2022 | 5:13 PM

Realme GT 2: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మి వార్షికోత్సవం సందర్భంగా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. వార్సికోత్సవ సేల్‌లో భాగంగా రియల్‌మీ జీటీ 2 ని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు వెల్లడించిన సంస్థ.. ఆ ఫోన్‌కు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఫోన్‌పై దాదాపు రూ.5,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఇదిలాఉంటే.. రియల్‌మి జీటీ 2 ఫీచర్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. డిస్‌ప్లే మొదలు ఫీచర్స్ అన్నీ అదుర్స్ అనేలా ఉన్నాయి. Realme GT 2 డిస్‌ప్లే, బయో-బేస్డ్ పాలిమర్ పేపర్ టెక్ మాస్టర్ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 888 5G ప్రాసెసర్‌లో Samsung E4 లుమినిసెంట్ మెటీరియల్‌ని ఉపయోగిస్తుంది. వార్షికోత్సవ సేల్స్‌లో భాగంగా Realme GT 2పై 5,000 ఫ్లాట్ తగ్గింపునిస్తోంది. అలాగే, HDFC డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌పై ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తోంది. ఈ ఫోన్ రూ. 29,999 (8GB+128GB), రూ.33,999 (12GB+256GB) ధరలో అందుబాటులోకి రానుంది.

రియల్‌మి జీటీ 2 25% వేగవంతమైన CPU పనితీరును, 35% ఎక్కువ GPU పనితీరును అందించడానికి Samsung 5nm ప్రాసెసర్ టెక్నాలజీతో Qualcomm Snapdragon 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz Samsung AMOLED డిస్‌ప్లేతో 1000Hz టచ్ శాంప్లింగ్, 2400×1080 FHD+ రిజల్యూషన్‌తో వస్తుంది. Realme GT 2 ట్రిపుల్ కెమెరాతో సోనీ IMX766 ఫ్లాగ్‌షిప్ సెన్సార్‌తో 119 డిగ్రీ అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP ప్రధాన కెమెరా, 4CM మాక్రో లెన్స్‌తో పాటు 65W సూపర్‌డార్ట్ ఛార్జ్, 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

రియల్‌మి జీటీ 2 మూడు రంగులలో అందుబాటులోకి రానుంది. పేపర్ వైట్, స్టీల్ బ్లాక్, పేపర్ గ్రీన్ రంగులలో రానుంది. అలాగే స్టోరేజ్ విషయంలో రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. 8GB+128GB, 12GB+256GB. రియల్‌మి జీటీ2 ఫస్ట్ సేల్ ఏప్రిల్ 28, మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్ Flipkart.com, realme.com సైట్‌లో అందుబాటులోకి విక్రయానికి రానుంది.

‘రియల్‌మి యానివర్సరీ సేల్’ ఏప్రిల్ 28 నుండి మే 9 వరకు షెడ్యూల్ చేయబడింది. 3 దశల్లో హోస్ట్ చేయబడుతుంది. మొదటగా రియల్‌మి జీటీ 2పై రూ.5,000 ప్లాట్ డిస్కౌంట్‌తో వార్షికోత్సవాన్ని ప్రారంభించనుంది. రెండవది ప్రపంచంలోని మొట్టమొదటి 150W ఛార్జింగ్‌ను పరిచయం చేయడం ద్వారా ఫ్లాగ్‌షిప్, Realme GT Neo 3, Realme Pad Mini, Buds Q2s ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఏప్రిల్ 29న Realme Air 3, రియల్‌మి స్మార్ట్ టీవీ కొత్త కలర్ వేరియంట్‌లను లాంచ్ చేస్తోంది. చివరగా వివిధ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు, AIOT ఉత్పత్తులపై భారీ తగ్గింపును ప్రకటించనుంది.

Also read:

Telangana Rain Alert: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరో గంటలో నగర వ్యాప్తంగా..

Hyderabad News: క్షణికావేశంలో దారుణం.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ మహిళ ఏకంగా..

Power Crisis: ముంచుకొస్తున్న విద్యుత్‌ సంక్షోభం.. బొగ్గు కొరతకు అసలు కారణం అదేనా?..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!