- Telugu News Photo Gallery Technology photos Noise launching new smart watch noise fit buzz features and price details
NoiseFit Buzz: బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా.? ఈ కొత్త వాచ్ మీకోసమే..
NoiseFit Buzz: ప్రముఖ గ్యాడ్జెట్ కంపెనీ నాయిస్ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. నాయిస్‌ఫిట్ బజ్ పేరుతో లాంచ్ చేయునన్న ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ వంటి అధునాతన ఫీచర్‌ను అందించనున్నారు..
Updated on: Apr 22, 2022 | 5:36 PM

మార్కెట్లో రకరకాల స్మార్ట్ వాచ్‌లు సందడి చేస్తున్న ఈ రోజుల్లో ఎక్కువ మంది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్న వాచ్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ ఫీచర్ ఉన్న వాచ్‌లు అందుబాటు ధరలో లేకపోవడంతో చాలా మంది ఇతర వాచ్‌లతో సరిపెట్టుకుంటున్నారు. తాజాగా నాయిస్ తక్కువ బడ్జెట్‌లో కొత్త వాచ్‌ను తీసుకొస్తోంది.

నాయిస్‌ఫిట్ బజ్ పేరుతో లాంచ్ చేయనున్న ఈ ఫోన్‌లో బ్లూటూత్ కాలింగ్ కోసం ఇన్‌బుల్ట్‌గా స్పీకర్, మైక్ ఫీచర్లు అందించారు. ఏప్రిల్ 28న ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, నాయిస్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ వాచ్ అసలు ధర రూ. 4, 799 కాగా ప్రారంభం ఆఫర్ కింద రూ. 2,999కి అందుబాటులోకి రానుంది.

ఇక ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం ఐపీ67 రేటింగ్ ఉంది. 360x360 పిక్సెల్ రెజల్యూషన్ ఉండే 1.37 ఇంచుల ట్రూవ్యూ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను అందించారు.

వర్చువల్ వాయిస్ అసిస్టెంట్స్‌కు సపోర్ట్ చేసే ఈ వాచ్‌లో హార్ట్‌రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ SpO2, స్లీప్ ట్రాకర్.. హెల్త్ ఫీచర్లతో పాటు 9 స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 7 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. రౌండ్ డయల్‌తో రూపొందించిన ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో రానున్న బడ్జెట్ వాచ్‌గా పేరు తెచ్చుకుంది.





























