Telangana Rain Alert: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరో గంటలో నగర వ్యాప్తంగా..
Telangana Rain Alert: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. మరో అర్థగంటలో నగర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్..
Telangana Rain Alert: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. మరో అర్థగంటలో నగర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న అరగంటలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, యాదాద్రి జిల్లాల్లో ఉరుములు, మేరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. జిల్లాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కల్లాల్లోని పంటలను సురక్షితంగా ఉంచుకోవాలని, వానకు తడవకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇక భాగ్యనగర వాసులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు.
మరిన్ని వెదర్ అప్‌డేట్స్ కోసం..
Also read:
Viral Video: సింహాలను ఓ ఆటాడుకున్న గ్రామ సింహం.. ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమనడానికి ఇదే నిదర్శనం..
Rajashekar – Jeevitha: హీరో రాజశేఖర్, జీవితలు మోసం చేశారు.. మీడియా ముందుకు జోస్టర్ ఫిలిం సర్వీసెస్.
Diabetic Patients: మధుమేహం ఉన్నవారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.. లేకపోతే ప్రమాదమే..!