Hyderabad News: క్షణికావేశంలో దారుణం.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ మహిళ ఏకంగా..

Hyderabad News: క్షణికావేశానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. మద్యం తాగడం కోసం కొడుకు డబ్బులు ఇవ్వలేదని మనస్తాపనం చెందిన ఓ మహిళ

Hyderabad News: క్షణికావేశంలో దారుణం.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ మహిళ ఏకంగా..
Hanging
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Apr 22, 2022 | 7:07 PM

Hyderabad News: క్షణికావేశానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. మద్యం తాగడం కోసం కొడుకు డబ్బులు ఇవ్వలేదని మనస్తాపనం చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తొర్రూర్ గ్రామానికి చెందిన ఆలకుంట వెంకటమ్మ మద్యానికి బానిసైంది. రోజూ మద్యం సేవించేది. ఈ క్రమంలోనే తాజాగా తన వద్ద మద్యం కొనేందుకు డబ్బు లేకపోవడంతో తన కుమారుడు అర్జున్‌ను డబ్బులు అడిగింది. దానికి అతను నిరాకరించాడు. ఆ క్రమంలో ఘర్షణ కూడా జరిగింది. దాంతో ఇంటి నుంచి వెళ్లిపోతానంటూ బట్టల బ్యాగును సర్దుకుని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే, కుమారుడు అర్జున్ సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గింది. కానీ, కొడుకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన వెంకటమ్మ.. రాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అర్థరాత్రి నిద్రలేచిన అర్జున్.. తల్లికోసం చూడగా ఎక్కడా కనిపించలేదు. ఆమె కోసం చుట్టుపక్కల అంతా గాలించినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇంతలో వెంకటమ్మ ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని స్థానికులు గమనించారు. విషయాన్ని మృతురాలి కొడుకు అర్జున్‌కు తెలియజేశారు. దాంతో అతను ఘటనా స్థలానికి వెళ్లి చూశాడు. పోలీసులకు సమాచారం అందించి, ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం..

Also read:

Ap News: వామ్మో! దాహంతో వెళ్తే.. రాకాసి ఫ్రిడ్జ్ నిండు ప్రాణాన్ని మింగేసింది..

Uttar Pradesh: ప్లాట్‌ఫాంపై కానిస్టేబుల్‌.. పట్టాలపై గూడ్స్‌ రైలు.. అంతలో..

Vijayawada: సామూహిక అత్యాచారం ఘటనలో ప్రభుత్వం సీరియస్.. పోలీసులపై సస్పెన్షన్ వేటు

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!