Uttar Pradesh: ప్లాట్‌ఫాంపై కానిస్టేబుల్‌.. పట్టాలపై గూడ్స్‌ రైలు.. అంతలో..

గూడ్స్‌ రైలు కింద పడి రైల్వే పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఆగ్రా రైల్వే స్టేషన్‌లో ఏప్రిల్‌ 16 న ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు(BIjnore) చెందిన రీగల్ కుమార్ సింగ్ ప్రభుత్వ రైల్వే పోలీస్‌ కానిస్టేబుల్‌గా...

Uttar Pradesh: ప్లాట్‌ఫాంపై కానిస్టేబుల్‌.. పట్టాలపై గూడ్స్‌ రైలు.. అంతలో..
woman murder
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 22, 2022 | 1:55 PM

గూడ్స్‌ రైలు కింద పడి రైల్వే పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఆగ్రా రైల్వే స్టేషన్‌లో ఏప్రిల్‌ 16 న ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు(BIjnore) చెందిన రీగల్ కుమార్ సింగ్ ప్రభుత్వ రైల్వే పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విధులు నిర్వహిస్తున్న అతను గత శనివారం రాత్రి ఫ్లాట్‌ఫామ్‌ వద్ద నిల్చొని ఉన్నాడు. ఆయన వెనకే ఒక గూడ్స్‌ రైలు వెళ్తోంది. అయితే ఒక్కసారిగా పక్కకు తిరిగి గూడ్స్‌ రైలు వెళ్లడం చూసిన కుమార్‌ సింగ్‌, అలా పలుమార్లు గుండ్రంగా తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ వెళ్లి ఫ్లాట్‌ఫాం అంచు నుంచి గూడ్స్ రైలు, పట్టాల మధ్యలో పడిపోయాడు. కాగా, కానిస్టేబుల్‌ రీగల్‌ కుమార్‌ సింగ్‌ గిరగిర తిరుగుతుండాన్ని చూసిన ఒక టీటీఈ ఆయనను కాపాడేందుకు పరుగెత్తుకుని అక్కడకు వచ్చారు. అయితే అప్పటికే కానిస్టేబుల్ ఫ్లాట్‌ఫామ్‌ పై నుంచి గూడ్స్‌ రైలు, పట్టాల మధ్యలో పడిపోవడంతో కాపాడలేకపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

మరోవైపు రైల్వే కానిస్టేబుల్‌ కుమార్‌ సింగ్‌ మృతి విషయం తెలిసి ఆయన కుటుంబ సభ్యులు షాకయ్యారు. కుమార్‌ సింగ్‌కు గైరేటరీ ఫిట్స్‌ ఉన్నట్లు వైద్య నిఫుణులు అనుమానిస్తున్నారు. ఈ మూర్ఛ అరుదుగా వస్తుందని తెలిపారు. తిరుగుడు మూర్ఛ వచ్చినప్పుడు వ్యక్తులు ఉన్నచోటనే 180 లేదా 360 డిగ్రీల వృత్తాకారంలో లేదా గిరగిర తిరిగి కిందకు పడిపోతారని చెప్పారు. సాధారణంగా కదులుతున్న వాటిని చూసినప్పుడు ఇలాంటి తిరుగుడు ఫిట్స్‌ వస్తాయని తెలిపారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read

Viral photo: ఇక్కడ తోపులెవరమ్మా..! ఈ ఫోటోలో ఉడుతను కనిపెట్టండి చూద్దాం.. క్లూస్ లేవ్

Telangana: సాయి గణేష్ ఆత్మహత్య దుమారం.. CBI విచారణ కోరుతూ హైకోర్టులో BJP పిటిషన్

Tamil Nadu: మదురైలో తీవ్ర విషాదం.. ట్యాంక్ లో విష వాయువులు వెలువడి ముగ్గురు కార్మికుల దుర్మరణం