AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: సామూహిక అత్యాచారం ఘటనలో ప్రభుత్వం సీరియస్.. పోలీసులపై సస్పెన్షన్ వేటు

విజయవాడ(Vijayawada) ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనలో పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం(Government) సీరియస్‌ అయింది. నున్న సీఐ, సెక్టార్‌ ఎస్ఐ లపై సస్పెన్షన్‌(Suspension) వేటు వేసింది. తమ కుమార్తె....

Vijayawada: సామూహిక అత్యాచారం ఘటనలో ప్రభుత్వం సీరియస్.. పోలీసులపై సస్పెన్షన్ వేటు
Vijayawada Ggh News
Ganesh Mudavath
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 22, 2022 | 7:07 PM

Share

విజయవాడ(Vijayawada) ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనలో పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం(Government) సీరియస్‌ అయింది. నున్న సీఐ, సెక్టార్‌ ఎస్ఐ లపై సస్పెన్షన్‌(Suspension) వేటు వేసింది. తమ కుమార్తె కనిపించట్లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు నున్న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే స్పందించకుండా సాయంత్రం రావాలంటూ పోలీసులు తిప్పి పంపేశారని బాధితులు వాపోయారు. చివరిసారిగా వచ్చిన ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా సమాచారామిచ్చినా స్పందించలేదని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసుల అలసత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఐ హనీష్‌, ఎస్సై శ్రీనివాసరావును విజయవాడ సీపీ కాంతిరాణా టాటా విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. మరోవైపు.. విజయవాడ ప్రభుత్వాసుపత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సామూహిక అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు హాస్పిటల్ కు వెళ్లిన మహిళా ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగిందని నినాదాలు చేశారు.

ఘటన జరిగిన తీరు..

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక దివ్యాంగురాలిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రేమ పేరుతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ అనే యువకుడు మరో ఇద్దరితో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. దీనిపై నున్న పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదు కాగా నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిని గుర్తించారు పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంత జరుగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారంటూ పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి.

CM Jagan in Ongole: పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ సొమ్ము జమ.. చంద్రబాబుపై నిప్పులు చేరిన సీఎం జగన్..

Bizarre: బిడ్డకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక.. పోలీసుల అదుపులో 12 ఏళ్ల బాలుడు

Six Airbags For Cars: కార్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు.. ఆరోజు నుంచే అమలులోకి కొత్త నిబంధనలు !