AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajashekar – Jeevitha: హీరో రాజశేఖర్, జీవితలు మోసం చేశారు.. మీడియా ముందుకు జోస్టర్ ఫిలిం సర్వీసెస్.

సీనియర్ హీరో రాజశేఖర్, జీవితలు మోసం చేశారంటూ మీడియాను ఆశ్రయించాడు జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు. సినిమాల నిర్మాణానికి ఆస్తులు

Rajashekar - Jeevitha: హీరో రాజశేఖర్, జీవితలు మోసం చేశారు.. మీడియా ముందుకు జోస్టర్ ఫిలిం సర్వీసెస్.
Rajasekar Jeevitha
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 22, 2022 | 8:27 PM

Share

జీవితరాజశేఖర్‌లపై చెక్‌బౌన్స్‌ ఆరోపణలు రావడం.. టాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. తమను మోసం చేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు.. మీడియా ముందుకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సినిమా నిర్మాణం కోసమని అప్పులు తీసుకున్నారనీ… ఇప్పుడు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనీ ఆరోపించారు. అప్పట్లో రాజశేఖర్‌ హీరోగా విడుదలైన గరుడ వేగ సినిమా నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో… ఆస్తులు తాకట్టుపెట్టి తమ దగ్గర నుంచి 26 కోట్ల రూపాయలు తీసుకున్నారని జోస్టర్‌ ఫిలిం సభ్యులు చెబుతున్నారు. తమ దగ్గరికొచ్చి చాలా ఎమోషనల్‌ అయ్యారనీ.. రాజశేఖర్‌ తండ్రి వరదరాజన్‌ చెప్పడంతో.. ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చామనీ తెలిపారు. ఆ తర్వాతే వారి నిజస్వరూపం తెలిసొచ్చిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మోసానికి సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయంటున్నారు జోస్టర్ ఫిలిం సర్వీస్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు, ఎండీ హేమ.

తమ దగ్గర తాకట్టుపెట్టిన ఆస్తులను బినామిల పేరుతో మార్చుకుని, మోసం చేశారని.. దానివల్ల తామెంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు జోస్టర్‌ ఫిలిం సభ్యులు. జీవిత చాలా డేంజరస్ అంటూ.. తీవ్ర ఆరోపణలు చేసిన బాధితులు, తమిళనాడు, ఏపీరాష్ట్రాల్లోనూ జీవితరాజశేఖర్‌లపై కేసులు విచారణలో ఉన్నాయని చెప్పారు. చెక్ బౌన్స్ కేసులో జీవితా రాజశేఖర్‌పై నగరి కోర్టు.. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. త్వరలోనే రాజశేఖర్ జైలుకు వెళ్తాడనీ చెప్పారు. అయితే, తమపై వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశారు జీవితారాజశేఖర్‌. అవన్నీ ఫాల్స్‌ ఆరోపణలన్నారు. దీనిపై పూర్తి వివరాలతో స్పందిస్తామని చెప్పారు. అప్పుడే నిజానిజాలు బయటకొస్తాయని స్పష్టం చేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Jersey Movie: జెర్సీ సినిమాపై ప్రశంసలు కురిపించిన న్యాచురల్ స్టార్.. మీ మంచి మనసే కారణమంటూ స్టార్ హీరో రిప్లై..

Neha Shetty: మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘డీజే టిల్లు’ రాధిక.. కార్తికేయ సరసన నేహా శెట్టి..

Prabhas: మార్షల్ ఆర్ట్స్ వస్తే ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్.. అనౌన్స్ చేసిన మేకర్స్.. ఏ మూవీలో తెలుసా..

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ ట్వీట్‌కు పగలబడి నవ్విన సమంత.. అసలేం జరిగిందంటే..