AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USA: అమెరికాలో ఇండియన్‌ మెడికల్‌ స్టూడెంట్‌ మృతి

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి కాల్పుల్లో మృతి చెందాడు. నార్త్‌ ఇండియాకు చెందిన మెడికల్‌ విద్యార్థి ఆదిత్య అద్లాఖా కారులో ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత మరణించాడు. ఈ సంఘటన నవంబర్ 9న జరుగగా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ మేరకు యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్‌ సెంటర్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. డాక్టరల్ విద్యార్థి ఆదిత్య మరణంపై..

USA: అమెరికాలో ఇండియన్‌ మెడికల్‌ స్టూడెంట్‌ మృతి
Indian Doctoral Student
Srilakshmi C
|

Updated on: Nov 24, 2023 | 8:39 AM

Share

వాషింగ్టన్‌, నవంబర్‌ 24: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి కాల్పుల్లో మృతి చెందాడు. నార్త్‌ ఇండియాకు చెందిన మెడికల్‌ విద్యార్థి ఆదిత్య అద్లాఖా కారులో ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత మరణించాడు. ఈ సంఘటన నవంబర్ 9న జరుగగా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ మేరకు యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్‌ సెంటర్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. డాక్టరల్ విద్యార్థి ఆదిత్య మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హామిల్టన్ కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం..

యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ స్కూల్‌లో ఆదిత్య అద్లాఖా మాలిక్యులర్ అండ్ డెవలప్‌మెంటల్ బయాలజీ ప్రోగ్రామ్‌లో పీహెచ్‌డీ నాల్గవ ఏడాది చదువుతున్నాడు. ఈ ఏడాది నవంబర్‌ 9వ తేదీన వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో కారు డ్రైవ్‌ చేస్తున్న సమయంలో అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో అదుపుతప్పిన కారు ఒక గొడను ఢీకొట్టింది. ఉదయం 6:20 గంటల ప్రాంతంలో కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. వాహనంలో బుల్లెట్‌ గాయాలతో ఉన్న వ్యక్తిని 911కు (అమెరికా అంబులెన్స్‌ నెంబర్) కాల్‌ చేసి కన్నింగ్‌హామ్‌కు తరలించినట్లు తెలిపారు. అనంతరం అద్లాఖా పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అతడిని యూసీ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మరణించినట్లు హామిల్టన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ధృవీకరించింది. కాల్పులు జరిగినప్పటి నుండి ఎవరినీ అరెస్టు చేయలేదని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. ఆదిత్య నడిపిన కారు, అద్దాలకు 3 బుల్లెట్‌ రంధ్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

అద్లాఖా ఆకస్మిక మరణం పట్ల యూనివర్శీటీ సీనియర్లతోపాటు ఆరోగ్య వ్యవహారాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీన్ ఆండ్రూ ఫిలక్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అద్లాఖాను అందరూ ఇష్టపడేవారు. ఎప్పుడూ నవ్విస్తూ నవ్వుతూ ఉండేవాడు. చాలా తెలివైన వాడు. అతడు న్యూరోఇమ్యూన్ కమ్యూనికేషన్‌లో అద్భుతమైన పరిశోధన చేశారని గుర్తు చేసుకున్నారు. ఆదిత్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా ఆదిత్య అద్లాఖా వైద్య విద్యనభ్యసించడానికి ఉత్తర భారత దేశం నుంచి సిన్సినాటి యూనివర్సిటీకి వచ్చాడు. 2018లో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రాంజాస్ కాలేజీలో ఆదిత్య అద్లాఖా జువాలజీలో బ్యాచిలర్ డిగ్రీని బ్యాచిలర్ డిగ్రీ చదివాడు. అనంతరం 2020లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) నుంచి ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తరువాత మాలిక్యులర్ అండ్ డెవలప్‌మెంటల్ బయాలజీలో పీహెచ్‌డీ కోసం అమెరికా వెళ్లాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.