China pneumonia: న్యుమోనియా కేసులపై చైనా కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే..
చైనాలో ఆసుపత్రుల్లో చిన్నారులతో పేరెంట్స్ బారులు తీరుతున్నారు. ఈ దృశ్యాలు చూస్తుంటే మళ్లీ కరోనా రోజులు గుర్తొస్తున్నాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు, జ్వరం, ఉపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంతు చిక్కని వ్యాధి వ్యాప్తి చెందకుండా పాఠశాలలను యాజమాన్యాలు తాత్కాలికంగా మూసివేశాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ సమస్యపై దృష్టిసారించింది...

కరోనా మహమ్మారి మిగిల్చిన విషాదం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాయదారి రోగం సృష్టించిన భీకర పరిస్థితులు ఇప్పటికీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచాన్ని వణికించిన కరోనా పుట్టిల్లు అయిన చైనాలో మరో ప్రమాదకర వ్యాధి కలవరపెడుతోంది. ప్రస్తుతం చైనాలో చిన్నారుల్లో అంతుచిక్కని న్యుమోనియా కలవరపెడుతోంది.
చైనాలో ఆసుపత్రుల్లో చిన్నారులతో పేరెంట్స్ బారులు తీరుతున్నారు. ఈ దృశ్యాలు చూస్తుంటే మళ్లీ కరోనా రోజులు గుర్తొస్తున్నాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు, జ్వరం, ఉపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంతు చిక్కని వ్యాధి వ్యాప్తి చెందకుండా పాఠశాలలను యాజమాన్యాలు తాత్కాలికంగా మూసివేశాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ సమస్యపై దృష్టిసారించింది. ఉత్తర చైనాలో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అలర్ట్ అయ్యింది. అంతు చిక్కని ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని చైనాను కోరింది. జబ్బు లక్షణాలు, అనారోగ్యానికి గురవుతున్న చిన్నారులుండే ప్రాంతాల వివరాలు ఇవ్వాలని అధికారులను అడిగింది. అలాగే, ఈ జబ్బు వ్యాప్తి చెందకుండా చైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అడిగిన ప్రశ్నకు చైనా అధికారులు స్పందించారు.
చైనాలో నమోదవుతోన్న న్యూమోనియా కేసుల్లో ఎలాంటి అసాధారణమైన లేదా కొత్త వ్యాధికారకాలను గుర్తించలేదని అధికారులు వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాధానం ఇచ్చారు. అక్టోబర్ నెల నుంచి చైనాలో చిన్నారుల్లో పెరుగులోన్న శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనీస్ నిఘా వ్యవస్థల నుంచి సేకరించిన డేటాను పర్యవేక్షిస్తోంది. అయితే మరింత సమాచారం కోసం చైనాను అధికారికంగా అభ్యర్థన చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చైనా ఈ విషయాన్ని వెల్లడించింది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అండ్ బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌తో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు WHO తెలిపింది.
అసాధారణమైన వ్యాధికారక లేదా అసాధారణమైన క్లినికల్ ప్రెజెంటేషన్‌లను గుర్తించలేదని చైనీస్ అధికారులు తెలిపారు. అయితే సాధారణ కారకాల వల్ల శ్వాసకోశ వ్యాధుల్లో పెరుగుదల ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. చైనాలో జరుగుతోన్న పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు, చైనాలోని అధికారులతో ఈ విషయమై ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు WHO అధికారులు తెలిపారు.
ఇదిలా ప్రస్తుతానిని చైనాకు వెళ్లే ప్రయాణికుల కోసం ఎలాంటి నిర్దిష్ట నిబంధనలు విధించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడుతోన్న వారికి దూరంగా ఉండాలని, మాస్క్‌ను కచ్చితంగా వాడాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే చైనాలో కోవిడ్ 19 వైరస్ వెలుగులోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తోన్న తరుణంలో ఇప్పుడీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..




