Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: ప్రపంచ దేశాల ముందు తల దించుకుంటున్న పాకిస్థాన్.. ఇప్పటికే ఆ బ్లాక్‌లిస్ట్‌లో 150 పాక్ సంస్థలు, వ్యక్తులు..

ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఒక వైపు ఆకలికేకలతో అల్లాడుతున్న ఆ దేశం మరోవైపు ఉగ్రవాద రాజ్యంగా అపకీర్తిని మూటకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు సంబంధించిన 150 ఉగ్రవాద సంస్థలు..

Pakistan: ప్రపంచ దేశాల ముందు తల దించుకుంటున్న పాకిస్థాన్.. ఇప్పటికే ఆ బ్లాక్‌లిస్ట్‌లో 150 పాక్ సంస్థలు, వ్యక్తులు..
Un Blacklists Another Terrorist Linked To Pak
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 18, 2023 | 11:26 AM

ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఒక వైపు ఆకలికేకలతో అల్లాడుతున్న ఆ దేశం మరోవైపు ఉగ్రవాద రాజ్యంగా అపకీర్తిని మూటకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు సంబంధించిన 150 ఉగ్రవాద సంస్థలు, వ్యక్తుల పేర్లను ఐక్యరాజ్యసమితి బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ లిస్టులోకి తాజాగా లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ పేరును కూడా ఐరాస భద్రతా మండలి అల్ ఖైదా ఆంక్షల కమిటీ ఉగ్రవాదిగా చేర్చింది . ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) 1267 ISIL (దాష్), అల్ ఖైదా ఆంక్షల కమిటీ సోమవారం(జనవరి 16) 68 ఏళ్ల మక్కీని ఉగ్రవాదుల లిస్టులోకి చేర్చినట్లు ప్రకటించింది. ఇక  అల్ ఖైదా ఆంక్షల కమిటీ నిబంధనల ప్రకారం ఉగ్రవాదుల జాబితాలో ఉన్న వ్యక్తుల ఆస్తులను జప్తు చేయడం, వారిపై ప్రయాణ, ఆయుధ ఆంక్షలు విధిస్తారు.

అయితే పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాల ముందు ఎండగట్టాలని చూస్తున్న దేశాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయా దేశాలు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్నాయి. అల్ ఖైదా ఆంక్షల కమిటీ జాబితా ప్రకారం ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి బ్లాక్‌లిస్ట్ చేసిన దాదాపు 150 తీవ్రవాద సంస్థలు, వ్యక్తులు పాకిస్తాన్‌లోనే ఉన్నవారు, ఆ దేశంతో సంబంధాలు కలిగి ఉన్నారు లేదా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల నుంచి పనిచేస్తున్నారే కావడం విశేషం.

లిస్టులో దావుద్, హఫీజ్ సయీద్ సహా పలువురు:

అల్ ఖైదా ఆంక్షల కమిటీ బ్లాక్‌లిస్ట్ చేసిన వారిలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న నాయకుడు, ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్.. లష్కరే అగ్ర ఉగ్రవాద కమాండర్, 26/11 ముంబై ఉగ్రదాడి కీలక సూత్రధారి జకీ-ఉర్ రెహ్మాన్ లఖ్వీ.. పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఇ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్.. పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా  ఉన్నారు.

ఇవి కూడా చదవండి

భారత్, అమెరికా సంయుక్త ప్రతిపాదన:

జమాత్ ఉద్ దవా/లష్కరే తోయిబా రాజకీయ వ్యవహారాల అధిపతి, లష్కరే చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్ బంధువు అయిన అబ్దుల్ రెహమాన్ మక్కీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని అనేక దేశాలు ప్రయత్నించాయి. ఆ క్రమంలో భాగంగానే భారతదేశం, యుఎస్ సంయుక్తంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మొదటి సారి పాకిస్థాన్ సన్నిహిత మిత్రదేశమైన చైనా అడ్డుకుంది. అయితే ఆ తీర్మానానికి ఏడు నెలల తర్వాత అంటే గతేడాది జూన్ 22న ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఎందుకంటే రెండోసారి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీజింగ్ అడ్డుకోలేదు.

భద్రతా మండలి అల్ ఖైదా ఆంక్షల కమిటీ:

1267 ISIL ఆంక్షల కమిటీ ప్రకారం ఒక వ్యక్తి లేదా సంస్థను ఉగ్రవాదుల జాబితా చేయాలనే నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకోవచ్చు. దీని ప్రకారమే 15 మంది సభ్యులతో కూడిన భద్రతా మండలి అల్ ఖైదా ఆంక్షల కమిటీని సృష్టించింది. దీనిలో చైనా మాత్రమే శాశ్వత వీటో కలిగి ఉంది. ఇక ఇది మొదటిగా మక్కీని జాబితా చేసే ప్రక్రియను నిరోధించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.