Mystery Rivers: భూమి కింద ప్రవహించే ఈ ఐదు నదుల గురించి మీకు తెలుసా..? ఆసక్తికర విషయాలు..!

Mystery Rivers: భారతదేశంలోని నదులు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇండియాలోని అలహాబాద్ సమీపంలో మూడు నదులు కలుస్తాయి. దీనిని త్రివేణి సంగమం..

Mystery Rivers: భూమి కింద ప్రవహించే ఈ ఐదు నదుల గురించి మీకు తెలుసా..? ఆసక్తికర విషయాలు..!
Follow us

|

Updated on: Oct 11, 2021 | 8:55 AM

Mystery Rivers: భారతదేశంలోని నదులు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇండియాలోని అలహాబాద్ సమీపంలో మూడు నదులు కలుస్తాయి. దీనిని త్రివేణి సంగమం అని కూడా అంటారు. కానీ భౌతికంగా గంగా, యమునా నదులు మాత్రమే కనిపిస్తాయి. సరస్వతి నది కనిపించదు. దీనిపై అనేక పరిశోధనలు జరిగాయి. ఫ్రెంచ్ ప్రోటో చరిత్రకారుడు మిచెల్ డానినో సరస్వతి నదిపై పరిశోధన అధ్యయనాలు కూడా నిర్వహించారు. సరస్వతి నది అంతరించిపోవడానికి భౌగోళిక మార్పు కారణమని పేర్కొన్నారు. ఈ రోజు కూడా సరస్వతి నది భూమి కింద ప్రవహిస్తుందని కొందరు నమ్ముతుంటారు. ప్రపంచంలో అనేక నదులు ఉన్నాయి. అవి భూమి కింద ప్రవహిస్తాయి. అలాంటి కొన్ని నదుల గురించి తెలుసుకుందాం.

లాబౌచే నది, ఫ్రాన్స్ :

ఫ్రాన్స్‌లోని లాబూయిచ్ నది ఐరోపాలో పొడవైన భూగర్భ నది. ఈ నది తొలిసారిగా 1906 లో కనుగొన్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు పర్యాటకులు ఈ నదిని చూడటానికి తరలివస్తుంటారు. ఈ నది ఒక చివర నుండి మరొక చివరకి వెళ్ళవచ్చు.

మిస్టరీ నది, ఇండియానా :

అమెరికాలోని ఇండియానాలో ఈ భూగర్భ నది కూడా ఉంది. అమెరికాలోని పొడవైన భూగర్భ నదిని ‘మిస్టరీ రివర్’ అంటారు. అయితే ఈ నదిని చూసేందుకు ప్రభుత్వం అందరిని అనుమతించేది కాదు. కొందరికి మాత్రమే అనుమతి ఉండేది. 19 వ శతాబ్దం నుండి ప్రజలకు దీని గురించి చాలా తెలుసు. కానీ 1940 తర్వాత అక్కడి ప్రభుత్వం దానిని సాధారణ ప్రజలు చూడడానికి కూడా అనుమతి ఇచ్చింది.

ప్యూర్టో ప్రిన్సిసా నది, ఫిలిప్పీన్స్:

నైరుతి ఫిలిప్పీన్స్‌లోని ప్యూర్టో ప్రిన్సిసా నది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. ఈ నది పొడవు ఐదు మైళ్లు. ఈ అందమైన నది భూమి కింద ఉన్న గుహల గుండా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఒక రోజులో 600 మంది పర్యాటకులకు మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది.

శాంటా ఫే నది, ఫ్లోరిడా:

ఈ నది అమెరికాలోని ఉత్తర ఫ్లోరిడాలో ఉంది. దీని పొడవు దాదాపు 121 కిలో మీటర్లు. ఇది పూర్తిగా భూగర్భంలో లేనప్పటికీ, ఇది 5 కిలో మీటర్ల వరకు భూగర్భంలో ప్రవహిస్తుంది. నది ఓ లీనో స్టేట్ పార్క్‌లోని పెద్ద సింక్‌ హోల్‌లో పడి 5 కిలో మీటర్ల వరకు భూగర్భంలోకి వెళుతుంది.

రియో కాము నది, ప్యూర్టో రికో :

దాదాపు ఒక మిలియన్ సంవత్సరాల పురాతన గుహల గుండా వెళుతున్న రియో కాము నదికి కూడా దాని స్వంత ఆకర్షణ ఉంది. ప్యూర్టో రికోలోని రియో కాము నది ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద భూగర్భ నది అని చెప్పబడింది.

ఇవీ కూడా చదవండి:

Volcano: అగ్నిపర్వతం విస్ఫోటనం.. మూడు వారాల తర్వాత భూకంపం.. భవనాలపైకి వచ్చిన లావా..

Viral News: 51 సంవత్సరాల క్రితం పోయిన పర్స్.. తీవ్రంగా శ్రమించి వెతికి పెట్టిన పోలీసులు.. ఓపెన్ చూస్తే షాక్..