Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bottles Flipping: వావ్.. కళ్లు చెదిరే ఫీట్.. సెకన్లలో 3 బాటిల్స్ ఫ్లిప్ చేశాడు.. ప్రపంచ రికార్డ్ సృష్టించాడు..!

Bottles Flipping: గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం తరచూ అనేకమంది అనేక రకాల ఫీట్స్‌ చేస్తుంటారు. అలాంటి వీడియోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తరచుగా వారి అధికారిక సోషల్‌ మీడియా...

Bottles Flipping: వావ్.. కళ్లు చెదిరే ఫీట్.. సెకన్లలో 3 బాటిల్స్ ఫ్లిప్ చేశాడు.. ప్రపంచ రికార్డ్ సృష్టించాడు..!
New Records
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 11, 2021 | 9:59 AM

Bottles Flipping: గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం తరచూ అనేకమంది అనేక రకాల ఫీట్స్‌ చేస్తుంటారు. అలాంటి వీడియోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తరచుగా వారి అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేస్తుంటారు కూడా. తాజాగా మరొక కొత్త ప్రపంచ రికార్డు వీడియోను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. మూడు ప్లాస్టిక్ బాటిళ్లను అత్యంత వేగంగా ఫ్లిప్ చేసి రికార్డ్ సృష్టించాడు బ్రెండన్ కెల్బీ అనే యువకుడు. ఈ ఫీట్‌కు గానూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందాడు. బాటిల్‌ను ఫ్లిప్ చేయడం చాలా సాధారణ విషయంగా అనిపించొచ్చు కానీ, దాన్ని ఫ్లిప్ చేయడంలోనూ టెక్నిక్‌తోపాటు ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఎంత ప్రాక్టీస్‌ చేసినప్పటికీ సరిగా చెయ్యలేకపోతే బాటిల్ సరిగా నిలబడదు. అలాంటిది బ్రెండన్ మూడు వాటర్ బాటిల్స్‌ను వెంట వెంటనే కేవలం 2.09 సెకన్లతో ఫ్లిప్ చేసి ఔరా అనిపించాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ చేయడంతో అతడిని గిన్నిస్ రికార్డ్ వరించింది.

ఓ భారతీయ యువకుడు 60 సెకన్లలో అత్యధికంగా ప్లాస్టిక్ బాటిల్‌ను తిప్పిన ప్రపంచ రికార్డును, 2021 జనవరిలో బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. అబూదాబిలో ఇంటర్ చదువుతున్న జోయెల్ మాథ్యూ కళ్లకు గంతలు కట్టుకుని అమెరికన్ జోష్ హోర్టన్ నెలకొల్పిన నిమిషంలో 27 బాటిల్ ఫ్లిప్‌ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. మాథ్యూ కూడా కళ్లకు గంతలు కట్టుకుని, సగం నింపిన 500 మి.లీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను 60 సెకన్లలో 37 సార్లు ఫ్లిప్ చేశాడు.

బాటిల్ ఫ్లిప్పింగ్ వీడియోలు ఇంటర్నెట్‌లో బాగా పాపులర్ అయ్యాయి. అంతేకాదు దీనిపై బోలెడన్నీ సవాళ్లు కూడా విసురుకుంటున్నారు. కొందరైతే బాటిల్ ఫ్లిప్ చేస్తే ప్రైజ్‌మనీ కూడా అందిస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే ఓ కుమారుడు తన తల్లి దగ్గరికి వెళ్లి..’ఈ బాటిల్‌ని గాల్లోకి విసిరి … తిరిగి అలాగే నిలబెట్టాలి. అలా చేస్తే నీకు రూ.2000 ఇస్తాను’ అంటూ ఫ్లిప్ చాలెంజ్ విసిరాడు. ఆమె ఏమాత్రం సంకోచించకుండా బాటిల్‌ని గాల్లో ఎగరేసి, ఫ్లిప్ చాలెంజ్ పూర్తి చేయడంతో కొడుకు షాక్ అయ్యాడు. తల్లికి 2వేలు ప్రైజ్ మనీ ఇచ్చుకున్నాడు. ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయింది. ఇక బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ సెప్టెంబర్‌లో ఫ్లిప్ బాటిల్ చాలెంజ్‌ను స్వీకరించి అద్భుతంగా ఫినిష్ చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానుల నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి.

Also read:

Bottles Flipping: వావ్.. కళ్లు చెదిరే ఫీట్.. సెకన్లలో 3 బాటిల్స్ ఫ్లిప్ చేశాడు.. ప్రపంచ రికార్డ్ సృష్టించాడు..!

Drone Flower: మంత్రి మెడలో డ్రోన్‌ పూలదండ.. టెక్నాలజీ అంటే ఇదే మరి అంటూ కామెంట్స్..( వీడియో)

Telangana High Court: మరికాసేపట్లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం..

'యానిమల్' విలన్‌ లవ్ స్టోరీనే రిపీట్ చేసిన టీమిండియా ప్లేయర్
'యానిమల్' విలన్‌ లవ్ స్టోరీనే రిపీట్ చేసిన టీమిండియా ప్లేయర్
ఈ వీకెండ్ లో వన్‌ డే టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు
ఈ వీకెండ్ లో వన్‌ డే టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు
త్వరలో శనిశ్వరుడి నక్షత్రం మార్పు.. వీరు బంగారం పట్టుకున్నా మసే..
త్వరలో శనిశ్వరుడి నక్షత్రం మార్పు.. వీరు బంగారం పట్టుకున్నా మసే..
ఇంటర్‌ ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే!
ఇంటర్‌ ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే!
ఈ పండ్లు తింటే మీ చర్మం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది..!
ఈ పండ్లు తింటే మీ చర్మం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది..!
కొత్త ఇల్లు నిర్మాణం.. పునాదిలో ఈ వస్తువులను ఉంచడం శుభప్రదం..
కొత్త ఇల్లు నిర్మాణం.. పునాదిలో ఈ వస్తువులను ఉంచడం శుభప్రదం..
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
షాపింగ్ కోసం వెళ్తున్నారా.. ఈ టిప్స్ తెలుసుకోండి
షాపింగ్ కోసం వెళ్తున్నారా.. ఈ టిప్స్ తెలుసుకోండి
ఆది శంకర మఠంలో మే1న చక్ర చండీ యాగం నిర్వహణ.. పూర్తి వివరాలు
ఆది శంకర మఠంలో మే1న చక్ర చండీ యాగం నిర్వహణ.. పూర్తి వివరాలు