UK PM Race: రిషి సునాక్‌కు ఎదురుదెబ్బ.. కన్జర్వేటివ్ పార్టీ పోల్‌లో నాలుగో స్థానం..

కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల పోల్‌లో రిషి సునాక్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి. పార్టీ సభ్యులు వైల్డ్ కార్డ్ అభ్యర్థి కెమీ బాడెనోచ్‌కు అత్యధిక ఆధిక్యాన్ని అందించారు.

UK PM Race: రిషి సునాక్‌కు ఎదురుదెబ్బ.. కన్జర్వేటివ్ పార్టీ పోల్‌లో నాలుగో స్థానం..
Rishi Sunak
Follow us

|

Updated on: Jul 18, 2022 | 4:28 PM

Rishi Sunak – UK PM Race: బ్రిటన్‌ ప్రధాని రేసులో ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నాయకుడు రిషి సునాక్‌ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. కన్జర్వేటివ్‌ పార్టీ లీడర్‌గా ఎవరు తుది వరకు నిలుస్తారో.. వారే బ్రిటన్‌ ప్రధాని పదవిని చేపట్టనున్నారు. దీనికో పలు రౌండ్ల పాటు ఓటింగ్‌ జరగనుంది. సభతోపాటు పార్టీలో పలు రౌండ్లపాటు ఓటింగ్ నిర్వహించి కన్జర్వేటివ్‌ పార్టీ లీడర్‌, ప్రధానిని ఎన్నుకోనున్నారు. అయితే.. తొలి రెండు రౌండ్లలో ముందంజలో నిలిచిన రిషి సునాక్‌‌కు ఎదురుదెబ్బ తగిలింది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల పోల్‌లో రిషి సునాక్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి. పార్టీ సభ్యులు వైల్డ్ కార్డ్ అభ్యర్థి కెమీ బాడెనోచ్‌కు అత్యధిక ఆధిక్యాన్ని అందించారు. బోరిస్ జాన్సన్ తర్వాత UK ప్రధానమంత్రి పదవికి కన్జర్వేటివ్ చీఫ్ ఎంపికలో భాగంగా పార్టీ సభ్యుల పోల్‌లో భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ నాల్గవ స్థానానికి పరిమితమయ్యారు. ఇది మాజీ ట్రెజరీ చీఫ్ సునాక్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఎందుకంటే.. రేసులో నిలవాలంటే కన్జర్వేటివ్ పార్టీ చట్టసభ సభ్యుల మెజారిటీ ఓటింగ్ తప్పనిసరి.

శనివారం 851 మంది టోరీ పార్టీ సభ్యులతో కన్జర్వేటివ్ హోమ్ పోల్ నిర్వహించారు. ఈ పోల్‌లో బాడెనోచ్‌కు 11 పాయింట్ల ఆధిక్యం దక్కింది. 31% మంది సభ్యులు బాడెనోచ్ కన్జర్వేటివ్ పార్టీ తదుపరి నాయకురాలిగా ఉండాలని చెప్పారు. విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ జూనియర్ వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్‌ 20% ఓటింగ్ తో రెండవ స్థానానికి చేరుకున్నారు. మోర్డాంట్ 18%తో మూడవ స్థానంలో నిలవగా.. సునాక్ 17% ఓట్లతో నాల్గవ స్థానంలో ఉన్నారు. మోర్డాంట్ కంటే తొమ్మిది ఓట్లు వెనుకబడ్డారు. ఫారిన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ టామ్ తుగెన్‌ధాట్ ఐదవ స్థానంలో ఉన్నారు.

కాగా.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్.. రిషి సునాక్ ప్రధానమంత్రి కాకుండా అంతర్గతంగా చేసిన ప్రచారం ఫలించినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌ ప్రధాని ఎన్నికలో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ను ఎలాగైనా ఓటమిపాలు చేసేందుకు తాత్కాలిక ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కుట్ర చేస్తున్నారని ఇటీవల ఓ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్‌ తప్ప.. మరెవరికైనా మద్దతు తెలపండి అంటూ బోరిజ్ జాన్సన్‌ (Boris Johnson) ఎంపీలకు సూచించినట్టు పేర్కొంది. అయితే.. ఇది కూడా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సర్వేలో సునాక్ ముందంజ.. కానీ..

అయితే.. ప్రధానిగా ఎవరైతే మంచిదన్న సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. JL పార్టనర్స్ ద్వారా జరిగిన అభిప్రాయ సేకరణలో చాలామంది రిషి సునాక్‌కు జై కొట్టారు. ఒపీనియన్‌ పోల్‌లో మెజారిటీ ఓటర్లు రిషి సునాక్‌ వైపే మొగ్గుచూపారు. రిషి సునాక్ మంచి ప్రధానిగా అవుతరాని చాలామంది పేర్కొన్నారు. అయితే.. కన్జర్వేటివ్ పార్టీ చేసిన సర్వేలో చాలా మంది పార్టీ ప్రజలు ఆయనను ప్రధానిగా చూడాలని కోరుకోవడం లేదని పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..