Richest Man: 7 నిమిషాల్లోనే కోటీశ్వరుడైన యూట్యూబర్.. ఎలన్ మస్క్‌ను సైతం వెనక్కి నెట్టేశాడు..
Richest Man: ఓ వ్యక్తి బిజినెస్ పెట్టిన కొంత కాలానికే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిపోయాడు. కానీ, ఆ తర్వాత అతను కంపెనీని..
Richest Man: ఓ వ్యక్తి బిజినెస్ పెట్టిన కొంత కాలానికే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిపోయాడు. కానీ, ఆ తర్వాత అతను కంపెనీని మూసేశాడు? మరి అతను ఆ కంపెనీని ఎందుకు మూసేశాడు? వివరాల్లోకెళితే.. ఒక వ్యక్తి కోట్లకు అధిపతి అయ్యాడంటే దాని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ, నిద్రలేని రాత్రులు, మాటల్లో చెప్పలేనన్ని కష్టాలుంటాయి. కానీ ఒక వ్యక్తి ఇలా బిజినెస్ పెట్టి అలా కోటీశ్వరుడైపోయాడు. అది కూడా 7 నిమిషాల్లోనే. మరో విశేషం ఏంటంటే, టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్‌ను సైతం వెనక్కి నెట్టేశాడు. అసలు ఇందతా జరుగుతుందా? ఇదేమైనా సినిమానా? అనిపిస్తుంది. కానీ ఇది రీల్ లైఫ్ స్టోరీ కాదు, ఓ వ్యక్తి రియల్ లైఫ్ స్టోరీనే.
యూకేకి చెందిన యూట్యూబర్ మాక్స్ ఫోష్ ఒకం కంపెనీని ఏర్పాటు చేశాడు. ఫోష్ కంపెనీ పెట్టే నిమిత్తం ఆ కంపెనీ హౌస్‌కి సంబంధించిన ఫారంని పూర్తి చేశాడు. కంపెనీ పేరుకు చివర కచ్చితంగా లిమిటెడ్‌తో ముగియాలి. అందుకని ఫోష్ తన కంపెనీ వెంచర్‌కి అన్ లిమిటెడ్ మనీ లిమిటెడ్ అని పేరు పెట్టాడు. పైగా తన కంపెనీ షేర్లను 10 బిలినియన్లగా నిర్ణయించి రిజిస్టర్ చేయించాడు ఫోష్. ఆ షేర్లలో ఒకదానిని 50 పౌండ్లకు విక్రయిస్తే, అతని కంపెనీకి చట్టబద్ధంగా 500 బిలియన్ పౌండ్లు విలువ ఇస్తుంది. ఆ యూట్యూబర్ లండన్ వీధిలో రెండు కుర్చీలు, టేబుల్‌తో తన ఆఫీస్‌ను ఏర్పాటు చేశాడు. మొదట్లో పెట్టుబడిదారుల కోసం కొంత ఇబ్బంది పడినా, ఆ తర్వాత ఒక మహిళ అతని కంపెనీలో 50 పౌండ్లకు ఒక షేర్‌ని కొనుగోలు చేసింది. దీంతో అతను ఏడు నిమిషాల పాటు ఎలెన్ మాస్క్‌ని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ తర్వాత అతనికి అధికారుల నుంచి ఒక లేఖను వచ్చింది. మనీ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ 500 బిలియన్ పౌండ్‌లుగా అంచనా వేశారని, ఆదాయ కార్యకలాపాలు లేకపోవడం వల్ల, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొవలసి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు అధికారులు. అందువల్ల అన్‌లిమిటెడ్ మనీ లిమిటెడ్‌ను రద్దు చేయాలని చెప్పారు. దీంతో ఫోష్ ఆ పని చేయక తప్పలేదు. ఈ తతంగానికి సంబంధించిన ఓ వీడియోని నెటిజన్లతో పంచుకున్నాడు ఫోష్.
Also read:
Singareni news: సింగరేణి కార్మికులకు రూ.40 లక్షలు బీమా.. వేతనం, హోదాకు సంబంధం లేకుండా..
TOP 9 NEWS: గుంటూరు జిల్లా దాచేపల్లి లో రోడ్డు మీద మిర్చి పంట దగ్ధం.. లైవ్ వీడియో