AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prince Harry: ఫోన్ హ్యాకింగ్ కేసులో తొలిసారి కోర్టు మెట్లు ఎక్కిన ప్రిన్స్ హ్యారీ.. రాజకుంటుంబం వ్యక్తులు 130 ఏళ్లలో ఇదే తొలిసారి

130ఏళ్ల తర్వాత బ్రిటీష్ రాజకుటుంబికులు లండన్ హైకోర్టుకు వచ్చారు. ఫోన్ హ్యాకింగ్ కేసులో తొలిసారి కోర్టు మెట్లు ఎక్కాడు ప్రిన్స్ హ్యారీ. మిర్రర్ గ్రూప్ ఫోన్‌ హ్యాకింగ్‌ పై ప్రిన్స్‌ హ్యారీతో పాటు వంద మందికిపైగా ప్రముఖులు కోర్టులో దావా వేశారు.

Prince Harry: ఫోన్ హ్యాకింగ్ కేసులో తొలిసారి కోర్టు మెట్లు ఎక్కిన ప్రిన్స్ హ్యారీ.. రాజకుంటుంబం వ్యక్తులు 130 ఏళ్లలో ఇదే తొలిసారి
U.k. Phone Hacking Lawsuit
Surya Kala
|

Updated on: Jun 07, 2023 | 6:49 AM

Share

వందల ఏళ్ళ బ్రిటీష్ రాజ కుటుంబ చరిత్రలో తొలిసారి ఓ వ్యక్తి కోర్టు మెట్లు ఎక్కాడు. రాజకుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ సాక్ష్యం చెప్పేందుకు లండన్ హైకోర్టుకు వెళ్లారు. తన వ్యక్తిగత జీవితంపై దాదాపు 2500 వార్తా కథనాలు పబ్లిష్ చేసినందుకు మిర్రర్ గ్రూప్ కు చెందిన మీడియా సంస్థపై ప్రిన్స్ హ్యారీ గతంలో కేసు వేశారు. ఫోన్ హ్యాకింగ్, చట్టవిరుద్ధమైన చర్యల ద్వారా తనకు తెలియకుండాసమాచారం సేకరించి పబ్లిష్ చేశారంటూ దాదాపు 140 న్యూస్ రిపోర్ట్స్‌ పై ఫిర్యాదులో తెలిపారు. ఇప్పుడు ఇదే కేసుకు సంబంధించిన వాదనలు లండన్ హైకోర్టులో జరగడంతో ప్రిన్స్ హ్యారీ కోర్టుకు వెళ్లారు.

అమెరికాలో ఉంటున్న హ్యారీ .. సాక్ష్యం చెప్పేందుకు లండన్‌ వచ్చారు. మిర్రర్ గ్రూప్ కు సంబంధించిన జర్నలిస్టులు.. ప్రైవేట్ డిటెక్టివ్‌లతో చేయించిన గూఢచర్యం, మోసం వల్లే హ్యారీ వ్యక్తిగత జీవితానికి విఘాతం కలిగిందని ఆయన తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. జర్నలిస్టులు, గూఢచర్యం వల్ల క్లోజ్ ప్రెండ్ చెల్సియా డేవీతో ప్రిన్స్ హ్యారీకి విభేదాలు వచ్చాయని చెప్పారు. ఇదే కేసుపై ఇప్పటివరకు నాలుగు బ్రిటిష్ మీడియా సంస్థలపై హ్యారీ కేసులు వేశారు. అందులో ఈ కేసు ఒకటి కాగా పలు మీడియా దిగ్గజాలపై కూడా హ్యారీ దావాలు వేశారు.

ఇక మిర్రర్‌ గ్రూప్‌ అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. మిర్రర్ గ్రూప్ ఫోన్‌ హ్యాకింగ్‌ పై ప్రిన్స్‌ హ్యారీతో పాటు వంద మందికిపైగా ప్రముఖులు కోర్టులో దావా వేశారు. బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన వ్యక్తులు కోర్టుకు హాజరవ్వడం 130 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 1870లో విడాకుల కేసు విషయంలో రాజకుటుంబానికి చెందిన ఎడ్వర్డ్‌ 7 కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత 1891లోను గ్యాంబ్లింగ్‌ కేసులో లండన్ హైకోర్టుకు వెళ్లారు. ఈ రెండు కేసులు ఎడ్వర్డ్ 7 రాజు కాకముందే జరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..