Russia – Ukraine War: ఉక్రెయిన్‌పై మరో భారీ దాడి.. నోవా కఖోవ్కా డ్యామ్‌ పేల్చివేత.. రష్యా రియాక్షన్ ఏంటంటే..

ఉక్రెయిన్‌ గుండెబద్దలైంది. నీపర్‌నదిపై కీలకమైన నోవా కఖోవ్కా డ్యామ్‌ను పేల్చివేశారు. ఇది రష్యాపనే అని ఉక్రెయిన్‌ అంటుండగా.. మాస్కో మాత్రం దీనిని ఉగ్రదాడితో పోల్చింది. ఈ క్రమంలో జెలెన్‌స్కీ అత్యవసర సమావేశం నిర్వహించారు.

Russia - Ukraine War: ఉక్రెయిన్‌పై మరో భారీ దాడి.. నోవా కఖోవ్కా డ్యామ్‌ పేల్చివేత.. రష్యా రియాక్షన్ ఏంటంటే..
Russia Ukraine War
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 06, 2023 | 9:45 PM

Russia-Ukraine war updates: ఉక్రెయిన్‌ భయపడినంతా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున నీపర్‌ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్‌ను పేల్చివేశారు. ఆనకట్టలో ఉన్న నీరంతా కిందకి ప్రవహిస్తోంది. సౌత్‌ ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ డ్యామ్‌ వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. కొన్ని నెలలుగా ఈ డ్యామ్‌ సమీపంలోనే భారీగా దాడులు జరుగుతున్నాయి. ఇది రష్యా దళాల పనేనని ఉక్రెయిన్‌ మిలటరీ కమాండ్‌ ఆరోపించింది. ఐతే ఈ దాడితో తమకు సంబంధంలేదని ఇది ఉగ్రదాడి అని రష్యా అధికారులు వెల్లడించారు.

మంగళవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి నోవా కఖోవ్కా డ్యామ్‌పై వరుసగా దాడులు జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. బాంబు దాడులతో డ్యామ్‌ గేటు వాల్వులు దెబ్బతిన్నాయి. దాంతో వాటర్‌ లీకై.. కొద్దిసేపటికే డ్యామ్‌ తెగిపోయింది. నీరు వరదలా కిందకి ప్రవహించింది. ఖెర్సాన్‌లో లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, అత్యవసరమైన పత్రాలు, నిత్యావసరాలు తీసుకొని ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు.

నీపర్‌నది తీరాని ఆనుకొని ఉండే మైఖోలావిక, ఓల్హిక, లివొ, టియాంగికా, పోనియాటివ్కా, ఇవానివ్కా, టోకరివ్కా గ్రామాలను వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. నోవా కఖోవ్కా డ్యామ్‌ పేల్చివేతను ఉక్రెయిన్‌ అధికారులు పర్యావరణ విధ్వంసంగా అభివర్ణించారు. డ్యామ్‌ విధ్వంసంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. దీనిలో నేషనల్‌ సెక్యూరిటీ, డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్‌లో మరింత పెరగనున్న కరెంట్ కష్టాలు..

ఈ డ్యామ్‌ 30 మీటర్ల ఎత్తు..కొన్ని వందల మీటర్ల పొడవు ఉంది. 1956లో కఖోవ్కా జలవిద్యుత్తు కేంద్రంలో భాగంగా నిర్మించారు. ఈ రిజర్వాయర్‌లో 18 క్యూబిక్‌ కిలోమీటర్ల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది. గతేడాది అక్టోబర్‌లో ఈ డ్యామ్‌ను ఉక్రెయిన్‌ దళాలు తిరిగి స్వాధీనం చేసుకొన్నాయి. అప్పటి నుంచి ఆనకట్టను పేల్చివేస్తారనే భయాలు నెలకొన్నాయి. తాజాగా ఈ డ్యామ్‌ పేల్చివేతతో ఉక్రెయిన్‌లో కరెంటు కష్టాలు మరింత పెరగనున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..