AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జార్జియాలో తీవ్ర విషాదం.. చూస్తుండగానే కుప్పకూలిన టర్కీ సైనిక విమానం..!

జార్జియాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం (నవంబర్ 11) తుర్కియే సి-130 మిలిటరీ కార్గో విమానం కుప్పకూలిపోయింది. ఈ విమానం అజర్‌బైజాన్ నుండి బయలుదేరి 20 మందిని తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియదు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు అధికారులు.

జార్జియాలో తీవ్ర విషాదం.. చూస్తుండగానే కుప్పకూలిన టర్కీ సైనిక విమానం..!
Turkish Military Plane Crashes
Balaraju Goud
|

Updated on: Nov 11, 2025 | 9:56 PM

Share

జార్జియాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం (నవంబర్ 11) తుర్కియే సి-130 మిలిటరీ కార్గో విమానం కుప్పకూలిపోయింది. ఈ విమానం అజర్‌బైజాన్ నుండి బయలుదేరి 20 మందిని తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియదు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు అధికారులు. విమానంలో ఉన్న 20 మంది మరణించినట్లు భావిస్తున్నారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం విమానంలో తుర్కియే తోపాటు అజర్‌బైజాన్ రెండింటికీ చెందిన వ్యక్తులు ఉండి ఉండవచ్చని తెలుస్తోంది. కానీ సంఖ్య స్పష్టంగా లేదు. టర్కీ-అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న జార్జియా తూర్పు కాఖేటి ప్రాంతంలో తుర్కియే సి-130 మిలిటరీ కార్గో విమానం కూలిపోయింది.

ఈ ఘటనపై టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ సంతాపం వ్యక్తం చేశారు. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ ఎర్డోగన్‌తో మాట్లాడారు. ఈ ఘటనపై టర్కీ-జార్జియన్ ప్రభుత్వాలు దర్యాప్తు ప్రారంభించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రమాద వీడియోలో, విమానం పర్వతాన్ని ఢీకొనే ముందు తెల్లటి పొగను వదిలి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రమాదం తర్వాత దట్టమైన నల్లటి పొగ ఎగసిపడింది.

వీడియో ఇక్కడ చూడండి.. 

C-130 సైనిక రవాణా విమానం

C-130 హెర్క్యులస్ విమానాన్ని అమెరికన్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసింది. ఇది నాలుగు ఇంజిన్ల టర్బోప్రాప్ సైనిక రవాణా విమానం. ఇది సరిగా లేని రన్‌వేల నుండి టేకాఫ్, ల్యాండ్ అయ్యేలా రూపొందించారు. దీని ప్రాథమికంగా సరుకు, రక్షణ దళాలు, పరికరాలను రవాణా చేయడానికి వినియోగిస్తారు. C-130 ను గన్‌షిప్, వైమానిక దాడి, నిఘా కార్యకలాపాలకు కూడా ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సైన్యాలకు ఇది ప్రాథమిక వ్యూహాత్మక ఎయిర్‌లిఫ్టర్‌గా పరిగణిస్తారు. ప్రమాదానికి కారణం లేదా విమానంలో ఉన్న వారి జాతీయతలకు సంబంధించి టర్కిష్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి సమాచారాన్ని విడుదల చేయలేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..