AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరుగుతున్న కరోనా కేసులు.. మరోసారి ఇటలీలో అంక్షలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది. రోజు రోజుకీ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు తలమునకలైన కుస్తీ పడుతున్నారు.

పెరుగుతున్న కరోనా కేసులు.. మరోసారి ఇటలీలో అంక్షలు
Balaraju Goud
|

Updated on: Oct 26, 2020 | 3:21 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది. రోజు రోజుకీ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు తలమునకలైన కుస్తీ పడుతున్నారు. మాయదారి వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. అయితే, ఇటలీ దేశంలో పెరుగుతున్న కొవిడ్-19 కేసులతో నవంబరు 24వతేదీ వరకు కొత్తగా ఆంక్షలు విధిస్తూ ఆ దేశ ప్రధానమంత్రి గియుసేప్ కొంటే ఉత్తర్వులు జారీ చేశారు. ఇటలీ దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను నిరోధించేందుకు నవంబరు 24వతేదీ వరకు జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్సు, సినిమా థియేటర్లను మూసివేయాలని ఆదేశించారు. ప్రజలందరూ ఖచ్చితంగా మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. గతంలో కరోనా మహమ్మారి నిరోధానికి 10 వారాల లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజల ఆరోగ్యంతోపాటు ఆర్థిక వ్యవస్థను రక్షించడమే తమ లక్ష్యమని ఆ దేశ ప్రధాని గియుసేప్ కొంటే అన్నారు.

ఇటలీలో గత రెండు రోజుల్లో 20వేల కరోనా కేసులు వెలుగుచూశాయి. యూరప్ లో బ్రిటన్ తర్వాత ఇటలీలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. బార్ అండ్ రెస్టారెంట్లను సాయంత్రం 6 గంటలకు మూసివేయడంతోపాటు అమెరికాతోపాటు ఇతర దేశాల నుంచి పర్యాటకుల రాకపోకలపై అంక్షలు విధించారు. కొత్త నిబంధనల ప్రకారం వివాహాలు, రిసెప్షన్లు, మత లేదా పౌర వేడుకలను నిషేధించారు. జిమ్ కు వెళ్లకుండా ఆరుబయట వ్యాయామం చేయవచ్చని ఇటలీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us