AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America: అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ తూటా.. ఏకకాలంలో మూడుచోట్లు కాల్పులు

అమెరికా(America) లో తుపాకీ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోంది. చిన్నచిన్న కారణాలకే సహనం కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. ఒక్లహామ్ కాల్పుల ఘటనను మరవకముందే మరో ఘటనలు ఏకకాలంలో జరగడం....

America: అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ తూటా.. ఏకకాలంలో మూడుచోట్లు కాల్పులు
Gun Firing
Ganesh Mudavath
|

Updated on: Jun 02, 2022 | 7:08 AM

Share

అమెరికా(America) లో తుపాకీ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోంది. చిన్నచిన్న కారణాలకే సహనం కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. ఒక్లహామ్ కాల్పుల ఘటనను మరవకముందే మరో ఘటనలు ఏకకాలంలో జరగడం సంచలనంగా మారింది. ఒక్లహామాలోని తుల్సా హాస్పిటల్ కు వచ్చిన దుండగుడు.. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఫిలిప్ కోసం వచ్చాడు. ఆయన కనిపించకపోయేసరికి తీవ్ర ఆగ్రహంతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే సమయంలో పెన్సిల్వేనియాలో పిట్స్‌టన్ వాల్‌మార్ట్ లో, కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజెల్స్ లో హైస్కూల్ లో కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతికి రూపుమాపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ నిందితుల్లో మార్పు రావకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

గతంలో జరిగిన ఘటనలో అమెరికాలోని ఓక్లహోమాలో ఆదివారం తెల్లవారు జామున కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీ స్కేర్ లో మెమోరియల్ డే ఫెస్టివల్ లో ఈ దారుణం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..తుల్సాకు ఆగ్నేయంగా ఉన్న టాఫ్ట్ సమీపంలో జరిగిన మెమోరియల్ డే భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సుమారు 1500 మంది ఈ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ లో ఘర్షణ చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన 26 ఏళ్ల స్కైలర్ బక్నర్ అనే యువకుడు ఒక్క సారిగా కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి ఉన్నారని పోలీసులు చెప్పారు. ఒక్కసారిగా కాల్పులు మోత విన్న వెంటనే ప్రజలు భయాందోళనతో ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి