Elon musk: వస్తే ఆఫీస్ కు రండి.. లేకపోతే ఉద్యోగం మానేయండి.. ఎంప్లాయ్స్ కు ఎలన్ మస్క్ వార్నింగ్
కరోనా(Corona) కారణంగా అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసుకునేలా వెసులుబాటు కల్పించాయి. టెస్లా(Tesla) కంపెనీ కుడా తమ సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. అయితే కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో...
కరోనా(Corona) కారణంగా అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసుకునేలా వెసులుబాటు కల్పించాయి. టెస్లా(Tesla) కంపెనీ కుడా తమ సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. అయితే కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఉద్యోగులు ఆఫీస్ లకు వచ్చి పని చేయాల్సిందేనని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. ఆఫీస్ లకు రాలేకపోతే ఉద్యుగాలు మానేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు వర్క్‌ఫ్రమ్ హోమ్(Work From Home) కు సంబంధించి ఎలాన్ మస్క్ తన ఉద్యోగులకు పంపించిన మెయిల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రిమోట్ వర్క్ చేయాలని అనుకుంటే వారంలో కనీసం 40 గంటలు ఆఫీస్ లో ఉండాల్సిందేనని మెయిల్ లో పేర్కొన్నారు. ఆఫీస్ అంటే ప్రధాన కార్యాలయమేనని, విధులకు సంబంధం లేని ఇతర బ్రాంచీలు కాదని తెలిపారు. సంస్థ ఉద్యోగులకు వచ్చిన ఈ-మెయిల్ లీకై ఉండవచ్చని ట్విటర్‌లో ఓ వ్యక్తి అనుమానం వ్యక్తం చేశాడు.
hey elon a lot of people are talking about this leaked email, any additional comment to people who think coming into work is an antiquated concept? https://t.co/E3qSBVrJIJ
ఇవి కూడా చదవండి— Whole Mars Catalog (@WholeMarsBlog) June 1, 2022
అయితే సంస్థ ఉద్యోగుల పట్ల ఎలన్ మస్క్ కాస్త కఠినంగా వ్యవహరిస్తారన్న వార్తలూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చైనా షాంఘైలో లాక్‌డౌన్ కారణంగా అక్కడున్న టెస్లా కార్యాలయంలో పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కార్మికుల చేత వారానికి ఆరు రోజులపాటు పని చేయించడం, నిత్యం 12 గంటలు పని చేయిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి