Job Reject: చావు కబురు చల్లగా.. ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటే ఎనిమిదేళ్ల తర్వాత రిప్లై.. ఏమని సమాధానం ఇచ్చారంటే
మంచి ఉద్యోగం దొరకాలని ఎవరికైనా ఉంటుంది. అందుకు ప్రయత్నం చేస్తారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. గ్రూప్ డిస్కషన్లో పాల్గొంటారు. అన్ని జరిగిన తర్వాత రిజక్ట్ అవుతారు. ఇది చాలా మందికి అనుభవం అయి ఉంటుంది...
మంచి ఉద్యోగం దొరకాలని ఎవరికైనా ఉంటుంది. అందుకు ప్రయత్నం చేస్తారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. గ్రూప్ డిస్కషన్లో పాల్గొంటారు. అన్ని జరిగిన తర్వాత రిజక్ట్ అవుతారు. ఇది చాలా మందికి అనుభవం అయి ఉంటుంది. రిజక్ట్ అయినట్లు రెండు రోజులకో లేక వారం రోజులకో ఇంక అయితే నెల రోజులకో మహా అయితే సంవత్సరానికి తెలుస్తుంది. కానీ ఓ మహిళకు రిజక్ట్ అయినట్లు ఎనిమిది ఏళ్ల తర్వాత సందేశం వచ్చింది. జో జాన్సన్ 2013 లో కెంట్‌లోని కాంటర్‌బరీలోని తన ఇంటి దగ్గర టీచింగ్ అసిస్టెంట్ ఖాళీ కోసం దరఖాస్తు చేసింది.
View this post on Instagram
కొద్ది రోజుల కింద రిజక్ట్ అయినట్లు సందేశం వచ్చింది. దీంతో ఆశ్చర్యపోయింది. కానీ జో, ఇప్పుడు 39 ఏళ్లు, తిరస్కరణతో పెద్దగా నిరాశ చెందలేదు. ఆమె ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సొంతంగా చర్మ సంరక్షణ వ్యాపారాన్ని ప్రారంభించింది. ” ఉద్యోగం కోసం వేచి ఉండలేదు’ అని చెప్పాలని అనుకున్నానని అన్నారు. “ఇది హాస్యాస్పదంగా ఉందని చెప్పింది. ఇప్పుడు ఆమె భర్త థియోతో సహా ఆరుగురు ఉద్యోగులతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. తమ వ్యాపారం బాగా జరుగుతుందని చెప్పారు. “మీ కోసం పని చేయడానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తులతో అవమానించేలా ప్రవర్తించడం మంచిది కాదని అన్నారు.
View this post on Instagram
Read Also..Coronavirus: వామ్మో.. చైనాలో మళ్ళీ కరోనా కల్లోలం.. విమానాల రద్దు.. స్కూల్స్ బంద్..