AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: వామ్మో.. చైనాలో మళ్ళీ కరోనా కల్లోలం.. విమానాల రద్దు.. స్కూల్స్ బంద్..

కరోనా పుట్టిల్లు చైనా మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తాజాగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు ప్రకటించింది చైనా. అక్కడి అధికారులు వందలాది విమానాలు రద్దు చేశారు.

Coronavirus: వామ్మో.. చైనాలో మళ్ళీ కరోనా కల్లోలం.. విమానాల రద్దు.. స్కూల్స్ బంద్..
China Corona Spread
KVD Varma
|

Updated on: Oct 21, 2021 | 8:15 PM

Share

Coronavirus: కరోనా పుట్టిల్లు చైనా మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తాజాగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు ప్రకటించింది చైనా. అక్కడి అధికారులు వందలాది విమానాలు రద్దు చేశారు. స్కూల్స్ మూసివేశారు. కోవిడ్ పరీక్షల వేగాన్ని పెంచి.. గురువారం భారీగా పర్యాటకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కొన్ని ఇతర దేశాల్లో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ అవి తాత్కాలికంగా పరిమితులను తగ్గిస్తున్నాయి. కానీ, చైనా మాత్రం దేశీయంగా అన్నిటినీ మూసివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సరిహద్దులను మూసివేయడంతో కరోనా విషయంలో చైనా చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో బాంబు చైనా పేలుస్తుందా అనే అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి.

అధికారులు చెబుతున్నదాని ప్రకారం చైనా వరుసగా ఐదవ రోజు కొత్త కేసులను నమోదు చేసింది. ఎక్కువగా ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఉంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణంగా పర్యాటకులను పేర్కొంటున్నారు. జియాన్, గన్సు ప్రావిన్స్ అదేవిధంగా ఇన్నర్ మంగోలియా వెళ్ళే ముందు ఒక వృద్ధ జంట షాంఘైలో పర్యటించారు. రాజధాని బీజింగ్‌తో సహా కనీసం ఐదు ప్రావిన్సులు.. ప్రాంతాలలో సన్నిహిత పరిచయాలతో డజన్ల కొద్దీ కేసులు వారి ప్రయాణంతో ముడిపడి ఉన్నాయి. వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని అధికారులు చెబుతున్నారు. దీంతో విమాన సర్వీసులు రద్దు చేయడమే కాకుండా.. పర్యాటకులను పూర్తిగా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వారిపై ఆంక్షలు విధించారు. వైమానిక ట్రాకర్ VariFlight డేటా ప్రకారం, ప్రభావిత ప్రాంతాలలోని విమానాశ్రయాలు వందల విమానాలను రద్దు చేశాయి.

జియాన్, లాంజౌలోని రెండు ప్రధాన విమానాశ్రయాలకు 60 శాతం విమానాలు రద్దు చేశారు. తమ పౌరులకు జారీచేసిన నోటీసులో ఇన్నర్ మంగోలియాలోని ఎరెన్‌హాట్ నగరం లోపల, వెలుపల ప్రయాణం నిషేధించారానీ, నివాసితులు తమ గృహాలను వదిలి వెళ్లవద్దని సూచించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్ బుధవారం, ఇన్నర్ మంగోలియాలో కొత్త వైరస్ కేసులు మంగోలియా నుండి బొగ్గు దిగుమతులను ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది, ఎందుకంటే అక్కడి ఆంక్షల వలన సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: Multibagger Stock Tips: ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. ఈ షేర్లు మాములుగా లేవుగా.. పెట్టుబడిదారులకు డబ్బులే డబ్బులు!

Car Safety Features: కారు భద్రతకు ఈ ఫీచర్లు ఎంతో అవసరం.. మీ కారులో ఇవి ఉన్నాయా మరి..!

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?