Punishment: పిల్లలు తప్పు చేస్తే శిక్ష తల్లిదండ్రులకే.. ఈ చట్టం ఎక్కడంటే..
పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఎవరయ్యా నువ్వు.. మీ తల్లిదండ్రులు నీకు పద్ధతి నెర్పలేదా అంటారు. అంతే కానీ ఏం చేయలేరు. కానీ ఓ దేశం పిల్లలు తప్పు తల్లిదండ్రులకు శిక్ష వేయడానికి చట్టం తీసుకురావలాని ఓ దేశం భావిస్తోంది...
పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఎవరయ్యా నువ్వు.. మీ తల్లిదండ్రులు నీకు పద్ధతి నెర్పలేదా అంటారు. అంతే కానీ ఏం చేయలేరు. కానీ ఓ దేశం పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష వేయడానికి చట్టం తీసుకురావలాని ఓ దేశం భావిస్తోంది. చైనా పార్లమెంట్ చిన్న పిల్లలు చెడుగా ప్రదర్శిస్తే లేదా నేరాలకు పాల్పడితే తల్లిదండ్రులను శిక్షించే చట్టాన్ని పరిశీలిస్తుంది. కుటుంబ విద్య ప్రమోషన్ చట్టం ముసాయిదాలో, సంరక్షకులు తమ సంరక్షణలో ఉన్న పిల్లలు తప్పు చేస్తే వారి సంరక్షకులే కారణం అవుతారని చెబుతుంది. “కౌమార దశలో ఉన్నవారు తప్పుగా ప్రవర్తించడానికి అనేక కారణాలు ఉన్నాయి. కుటుంబ విద్య లేకపోవడం ప్రధాన కారణం” అని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) శాసన వ్యవహారాల కమిషన్ ప్రతినిధి జాంగ్ టైవే అన్నారు. ఈ వారం NPC స్టాండింగ్ కమిటీ సెషన్‌లో కుటుంబ విద్యా ప్రోత్సాహక చట్టం సమీక్షిస్తుందని తెలిపారు.
బీజింగ్‌లో ఈ సంవత్సరం చాలా మంది యువకులు ఆన్‌లైన్ గేమ్‌లు, నల్లమందుకు బానిసగా మారారు. పిల్లలను పట్టించుకోకపోవడం, వారు ఏం చెప్పిన గుడ్డిగా నమ్మడంతో పిల్లలకు స్వే్చ్ఛ ఎక్కువ అయిందని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలి కాలంలో విద్యా మంత్రిత్వశాఖ మైనర్లు గేమ్‌లు ఆడే సమయంపై పరిమితి విధించింది. శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే ఒక గంట పాటు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటానికి వీలు కల్పిస్తుంది. ఇది హోంవర్క్‌ను తగ్గించింది. సెలవు దినాలలో ప్రధాన సబ్జెక్టులకు పాఠశాల తర్వాత ట్యూటరింగ్‌ను నిషేధించింది. అదే సమయంలో, చైనా యువకులు తక్కువ లింగ నిష్పత్తిపై దృష్టి సారించింది.