Pakistan: దాయాది దేశంలో దుర్భర పరిస్థితులు.. గోధుమ పిండి క్యూలైన్లు.. తొక్కిసలాటలతో భీతావహం

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ దుర్భర జీవితం గడుపుతోంది. ప్రజలకు కనీసం తినడానికి తిండి కూడా దొరకడం లేదు. నిన్న మొన్నటి వరకు శ్రీలంక సంక్షోభం కళ్లకు కడితే.. ఇప్పుడు దాయాది దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి....

Pakistan: దాయాది దేశంలో దుర్భర పరిస్థితులు.. గోధుమ పిండి క్యూలైన్లు.. తొక్కిసలాటలతో భీతావహం
Pakistan Crisis
Follow us

|

Updated on: Jan 10, 2023 | 4:40 PM

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ దుర్భర జీవితం గడుపుతోంది. ప్రజలకు కనీసం తినడానికి తిండి కూడా దొరకడం లేదు. నిన్న మొన్నటి వరకు శ్రీలంక సంక్షోభం కళ్లకు కడితే.. ఇప్పుడు దాయాది దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. విదేశీ మారక నిల్వలు పడిపోతుండటంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుత్తం అవి 5.8 బిలియన్ల డాలర్లకు తగ్గి, ఎనిమిదేళ్ల కనిష్ఠానికి చేరాయి. ఆ నిల్వలు కేవలం మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్ బ్యాంక్‌ ఆప్‌ పాకిస్థాన్‌ నివేదిక వెల్లడిస్తోంది. దీనిపై ఆర్ధిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్‌ కూడా స్పందించారు. పాకిస్తాన్ దివాళా తీయదని, ఈ పరిస్థితికి ఇమ్రాన్ ఖాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని నిందించారు.

గోధుమల కొరత వల్ల అందరికి పిండి అందుబాటులో ఉండటం లేదు. సబ్సిడీలో లభించే గోధుమ పిండి కోసం ప్రజలు గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. దాంతో ఖైబర్‌ ఫంక్తుఖ్వా, సింధ్‌, బలూచిస్థాన్‌ ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగాయి. రేషన్ దుకాణాల వద్ద తోపులాటలు సర్వసాధారణమైపోయాయి. భద్రతా బలగాల పహారాలో పిండిని పంపిణీ చేసేందుకు వాహనాలు వస్తున్నాయి. వాటి చుట్టూ జరిగే తోపులాటలు తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఉద్రిక్తతల కారణంగా కొందరు ప్రాణాపాయ స్థితిలోకి జారుకుంటున్నారు.

ఈ సంక్షోభం వేళ.. గోధుమలు, పిండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. కేజీ పిండికి రూ.160 చెల్లించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ఇదే అదనుగా మిల్లు యజమానులు ధరలు పెంచుతున్నారు. ప్రస్తుత ఆహార సంక్షోభానికి గతేడాది వరదలు కూడా కారణం. పాక్‌ చరిత్రలోనే అవి అత్యంత దారుణమైన వరదలని ప్రపంచ వాతావరణ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..