UK: మరీ ఇంత దారుణమా.. ఎవరిపై అత్యాచారం చేయాలో లిస్ట్ రాసుకుని మరీ..

నేటి సమాజంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఒంటరిగా ఉన్న సమయాల్లో, పని ప్రదేశాల్లో వేధింపులు అధికమయ్యాయి. బ్రిటన్ లోనూ ఈ తరహా..

UK: మరీ ఇంత దారుణమా.. ఎవరిపై అత్యాచారం చేయాలో లిస్ట్ రాసుకుని మరీ..
Submarine In Britain
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 30, 2022 | 9:49 AM

నేటి సమాజంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఒంటరిగా ఉన్న సమయాల్లో, పని ప్రదేశాల్లో వేధింపులు అధికమయ్యాయి. బ్రిటన్ లోనూ ఈ తరహా వేధింపులు ప్రస్తుతం వెలుగులోకి రావడం పెను సంచలనంగా మారింది. మహిళలపై వారు చేసే వేధింపులు ఎలా ఉండేవంటే.. ఎవరిపై ఎప్పుడు అత్యాచారం చేయాలో ఓ లిస్ట్ రాసుకుని మరీ దాడులకు పాల్పడేంతగా. బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన జలాంతర్గామిల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు బయటపడటం కలకలం రేపింది. దీనిని తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు.. బ్రిటన్‌ నేవల్‌ స్టాఫ్‌ చీఫ్‌ బెన్‌ కీ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. రాయల్‌ నేవీలో లైంగిక వేధింపులకు చోటే లేదని, ఇటువంటి వాటిని సహించేది లేదని స్పష్టం చేశారు. దోషులుగా తేలిన వారెవరైనా సరే ర్యాంకుతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే.. 2011 నుంచి బ్రిటన్‌ రాయల్ నేవీ తన సబ్‌ మెరైన్‌ సేవల్లో మహిళా సిబ్బందిని నియమిస్తోంది.

ఈ క్రమంలోనే సోఫీ బ్రూక్‌ అనే మహిళ కూడా విధుల్లో చేరారు. కొన్నేళ్లకు ఆమెకు కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించాలంటూ ఆదేశాలు వచ్చాయి. అయితే అక్కడ ఆమెపై జరిగిన లైంగిక వేధింపులను భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. దీన్ని తీవ్రంగా తీసుకున్న నేవీ ఆమెను విధుల్లోంచి తొలగించింది. ఈ క్రమంలో ఆమె జలాంతర్గామిలో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు. విధుల సమయంలో కొంతమంది లైంగికంగా వేధించేవారని, నిద్రపోయే సమయంలో శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవారని చెప్పారు.

అత్యాచారం చేయాల్సిన మహిళా సిబ్బంది జాబితానూ రూపొందించుకున్నారని, అందులో తన పేరు ఆరో స్థానంలో ఉండటం చూసి షాక్‌కు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వారి నుంచి తప్పించుకోవాలని, తనకు తాను గాయపరుచుకుని బయటకు వచ్చినా తనపై నిరంతర నిఘా ఉంచినట్లు ఆమె చెప్పడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?
భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా 2024.. నయా ఆయుధాల ప్రవేశం
భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా 2024.. నయా ఆయుధాల ప్రవేశం
బాలయ్య ముందే ప్రభాస్‍కు కాల్ చేసిన చరణ్..
బాలయ్య ముందే ప్రభాస్‍కు కాల్ చేసిన చరణ్..