AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: సంచలనంగా మారిన బైడెన్ కామెంట్స్.. అమెరికాకు సమన్లు జారీ చేసిన పాక్.. వివరణ ఇవ్వాలంటూ ఆర్డర్స్..

అమెరికాపై పాకిస్తాన్‌ సీరియస్‌ అయింది. ఆ దేశాధ్యక్షుడు బైడెన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌ అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటన్న కామెంట్స్‌పై అమెరికా వివరణ కోరింది పాక్‌. పాకిస్తాన్‌ ప్రపంచంలోనే..

Pakistan: సంచలనంగా మారిన బైడెన్ కామెంట్స్.. అమెరికాకు సమన్లు జారీ చేసిన పాక్.. వివరణ ఇవ్వాలంటూ ఆర్డర్స్..
Joe Biden
Ganesh Mudavath
|

Updated on: Oct 16, 2022 | 8:50 AM

Share

అమెరికాపై పాకిస్తాన్‌ సీరియస్‌ అయింది. ఆ దేశాధ్యక్షుడు బైడెన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌ అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటన్న కామెంట్స్‌పై అమెరికా వివరణ కోరింది పాక్‌. పాకిస్తాన్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకట అనే అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇస్లామాబాద్‌లోని యూఎస్ అంబాసిడర్‌కు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. అమెరికా రాయబారిని పిలిపించి బైడెన్‌ వ్యాఖ్యలపై వివరణ కోరింది. మరో వైపు బైడెన్‌ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని పాక్‌ విదేశాంగమంత్రి బిలావల్‌ భుట్టో-జర్దారీ అన్నారు. పాకిస్తాన్ – అమెరికా మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతోనే అపార్థం చేసుకొని ఉంటారన్నారు. అమెరికా రాయబారిని వివరణ కోరడం, రెండు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తాను భావించడం లేదన్నారు. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన డెమోక్రటిక్‌ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ రిసెప్షన్‌లో మాట్లాడిన బైడెన్‌.. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాకిస్తాన్ ఒకటని అభిప్రాయపడ్డారు.

చైనా, రష్యా వంటి దేశాలతో విదేశాంగ విధానాల గురించి ప్రస్తావిస్తూ పాక్‌ వైఖరిని తప్పు బట్టారు. ఎలాంటి సమన్వయం లేకుండానే అణ్వాయుధాలు, చైనాతో సంబంధాలను కొనసాగిస్తోందన్నారు. బైడెన్ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు షాకిచ్చాయి. అమెరికా పాకిస్థాన్‌కు దశాబ్దానికి పైగా సైనిక సాయం అందిస్తోంది. అంతేకాదు, అధునాతన యుద్ధ విమానాలు అందించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. అమెరికాతో ఇప్పుడిప్పుడే సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నామని అనుకుంటున్న ఆ దేశానికి.. తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. ఇవన్నీ అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ ప్రయత్నానికిది ఎదురుదెబ్బగా మారిందని నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే బైడెన్‌ అడ్మిస్ట్రేషన్‌ కీలక డ్యాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఇందులో చైనా, రష్యాల నుంచి అమెరికాకు పొంచి ఉన్న ముప్పును ప్రస్తావించారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘నో లిమిట్స్‌ పార్టనర్‌షిప్‌’ను ప్రకటించిన చైనా, రష్యాలు కలిసిపోతున్నాయని, అయితే అవి విసిరే సవాళ్లు మాత్రం విభిన్నంగా ఉన్నాయని అమెరికా జాతీయ భద్రతా వ్యూహం పేర్కొంది.