Thailand Princess: థాయిలాండ్ యువరాణికి తీవ్ర అశ్వస్థత.. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స! తెరవెనుక అనుమానాలు..
థాయిలాండ్ యువరాణి బజ్రకిటియభా (44) గురువారం (డిసెంబర్ 15) సాయంత్రం అశ్వస్తతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో మిలిటరీ శునకాలకు శిక్షణ ఇస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా..
థాయిలాండ్ యువరాణి బజ్రకిటియభా (44) గురువారం (డిసెంబర్ 15) సాయంత్రం అశ్వస్తతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో మిలిటరీ శునకాలకు శిక్షణ ఇస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం హెలిక్యాఫ్టర్‌లో బ్యాంకాక్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువరాణికి చికిత్స అందుతోందని, ఆరోగ్యం నిలకడగానే ఉందని థాయ్ రాజకుంటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు సీపీఆర్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదని.. ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
థాయ్‌లాంగ్ కింగ్ మహా వజిరాలాంగ్‌కార్న్ మొదటి భార్య సంతానమే యువరాణి బజ్రకిటియభా (పెద్ద కుమార్తె). ఆమె బ్రిటన్ యూనివర్సిటీ నుంచి ‘లా’లో అండర్ గ్రాడ్యుయేషన్, న్యూయార్క్‌లని కార్నెల్ యూనివర్సిటీ నుంచి ‘లా’ విభాగంలో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 2012లో ఆస్ట్రేలియా-థాయ్‌లాండ్‌కు బజ్రకిటియభా రాయబారిగా పనిచేశారు. వియన్నాలోని ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. అంతేకాకుండా థాయ్ లీగల్ సిస్టంలో ప్రాసిక్యూటర్‌గాకూడా పని చేస్తున్నారు. థాయ్‌లాంగ్ నియమాల ప్రకారం రాజుకు జన్మించిన మగ సంతానం మాత్రమే వారసత్వం పొందుకొవడానికి అర్హులు. తదుపరి రాజు గురించి థాయ్ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఐతే తదుపరి వారసురాలు యువరాణి బజ్రకిటియభా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో థాయ్ యువరాణి ఆరోగ్యం క్షీణించడం, 44 ఏళ్లకే గుండెపోటు రావడం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితేంటో బయటకు చెప్పకపోవడం మిస్టరీగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.