Viral Video: అందరూ చూస్తుండగానే ఊహించని అలజడి.. అనుకోని అతిధి రాకతో గుండె గుభేల్!

సరీసృపాలలో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైనది. పెద్ద జంతువులను సైతం అమాంతం మింగేస్తుంది..

Viral Video: అందరూ చూస్తుండగానే ఊహించని అలజడి.. అనుకోని అతిధి రాకతో గుండె గుభేల్!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 16, 2022 | 1:58 PM

సరీసృపాలలో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైనది. పెద్ద జంతువులను సైతం అమాంతం మింగేస్తుంది. చిరుత, సింహం, పులి లాంటి వాటితో కూడా సమవుజ్జీగా పోరాటం చేయగలదు. అలాంటి కొండచిలువలను విదేశాల్లో చాలామంది వ్యక్తులు తమ ఇళ్లల్లో పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. అయితే ఆ చర్యే తమ ప్రాణాలకు ముప్పు తెచ్చేలా చేస్తుందని ఎవ్వరూ ఊహించరు. అందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇంట్లోని బాల్కనీలో ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి ఏమో పక్కనే ఉన్న గ్లాస్ బాక్స్‌ను తెరుద్దామని ప్రయత్నించాడు. ఇలా తెరిచాడో.. లేదో.. అలా కొండచిలువ బయటికొచ్చి అతడ్ని పట్టుకుంటుంది. తన బలమైన దంతాలతో ఆ వ్యక్తి చేతిని పట్టుకుని అస్సలు వదిలిపెట్టదు. ఆ కొండచిలువ నుంచి అతడ్ని కాపాడేందుకు.. మరో ముగ్గురు అక్కడికి చేరుకుంటారు. ఏదైతేనేం చివరికి చిన్న చిన్న గాయాలతో కొండచిలువ బారి నుంచి అతడ్ని రక్షించుకోగలిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండింగ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by @laris_a9393