Asha Worker Jobs in AP: పదో తరగతి పాసైన వివాహితలకు గమనిక.. కర్నూలు జిల్లాలో ఆశావర్కర్ ఉద్యోగాలు..ఈ రోజే ఆఖరు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యూపీహెచ్‌సీ/పీహెచ్‌సీ పరిధిలో.. 61 ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యూపీహెచ్‌సీ/పీహెచ్‌సీ పరిధిలో.. 61 ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ప్రాంతంలో నివాసితులైన వివాహిత అయ్యి ఉండాలి. తెలుగు భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.ఈ అర్హతలున్న అభ్యర్ధులు డిసెంబర్ 16, 2022లోపు కింది అడ్రస్‌లో అప్లికేషన్లను సమర్పించాలి. అకడమిక్ మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: జిల్లాలోని సంబంధిత యూపీహెచ్‌సీ/ పీహెచ్‌సీల్లోని మెడికల్ ఆఫీసర్‌కు దరఖాస్తులు అందజేయాలి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.