NFDC Jobs: నెలకు రూ.70,000ల జీతంతో నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉద్యోగావకాశాలు..ఈ అర్హతలున్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి..

పూణెలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎఫ్‌డీసీ)- నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా.. అవుట్‌సోర్సింగ్‌/ ఒప్పంద ప్రాతిపదికన 25 ఐటీ ఇంజినీర్, అడ్మిన్ అసిస్టెంట్, గ్రాఫిక్ డిజైనర్, అకౌంట్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి..

NFDC Jobs: నెలకు రూ.70,000ల జీతంతో నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉద్యోగావకాశాలు..ఈ అర్హతలున్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి..
National Film Archive of India
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 16, 2022 | 9:02 AM

పూణెలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎఫ్‌డీసీ)- నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా.. అవుట్‌సోర్సింగ్‌/ ఒప్పంద ప్రాతిపదికన 25 ఐటీ ఇంజినీర్, అడ్మిన్ అసిస్టెంట్, గ్రాఫిక్ డిజైనర్, అకౌంట్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో యూజీ, పీజీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 2 నుంచి ఐదేళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 23, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలి. ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను సెలెక్ట్‌ చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

ఐటీ ఇంజినీర్, అడ్మిన్ అసిస్టెంట్, గ్రాఫిక్ డిజైనర్, అకౌంట్‌ అసిస్టెంట్‌, హిందీ అసిస్టెంట్, కంటెంట్ రైటర్, లైబ్రేరియన్, క్యూరేటర్, సూపర్‌వైజర్/ ప్రొజెక్షనిస్ట్, సీనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ ప్రిజర్వేషన్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్, ప్రొజెక్షన్ అసిస్టెంట్, ఫిల్మ్ చెకర్, వీడియో టెక్నీషియన్, కేటలాగ్ ఎక్స్‌పర్ట్‌, అసిస్టెంట్ ప్రిజర్వేషన్ ఆఫీసర్, సీనియర్ ఫిల్మ్ చెకర్, డాక్యుమెంట్ ఎక్స్‌పర్ట్‌, సీనియర్ ప్రొజెక్షనిస్ట్ తదితర పోస్టులు.

ఇవి కూడా చదవండి

అడ్రస్:

General Manager (P&A), National Film Development Corporation Ltd., Discovery of India Building, 6th Floor, Nehru Centre, Dr. Annie Besant Road, Worli, Mumbai.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.